నేచురల్ స్టార్ అని నానికి బిరుదిచ్చినప్పుడు చాలా మంది విమర్శలు చేశారు. అవేదో ఎక్స్‌ట్రా పనులనుకున్నారు. కానీ ఆయన చేస్తున్న ప్రస్తుత చిత్రాలు చూస్తుంటే ఆ బిరుదు నానికి తప్ప మరెవ్వరికీ సూట్ కాదని అంటున్నారు. కష్టాలలో ఇక రేపో మాపో కనుమరుగవుతున్నాడని భావించిన సమయంలో 'ఎవడే సుబ్రహ్మణ్యం'తో ఊపిరి పీల్చుకున్నాడు. ఇక అక్కడి నుంచి నానికి స్పీడ్ బ్రేకర్లే లేవు.
ప్రకృతి వైపరీత్యాల సమయంలో వచ్చిన 'మజ్ను' కూడా నిర్మాతలకు, బయ్యర్లకు లాభాలనే మిగిల్చింది. ఇక నిన్నటి వరకు నాని కెరీర్‌లో 'భలే భలే మగాడివోయ్, నేను లోకల్'లు పెద్ద హిట్స్. ఈ రెండు చిత్రాలు నానిని స్టార్‌ని చేశాయి. కానీ 'ఈగ'ను పక్కనపెడితే తాజాగా ఆయన నటించిన 'నిన్నుకోరే' చిత్రం ఆయన కెరీర్‌లోనే ఎక్కువ ఓపెనింగ్స్ తెచ్చుకున్న చిత్రంగా రికార్డులకి ఎక్కింది.
తాజాగా ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం నాని కెరీర్‌లో 'నేను లోకల్' 35కోట్ల మార్క్‌ని అందుకుంది. తాజాగా 'నిన్నుకోరే' చిత్రం లాంగ్ రన్‌లో దానిని దాటిపోతుందని అంచనా వేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాదు... ఓవర్‌సీస్‌లో కూడా ఈ చిత్రం కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.ఈ చిత్రంలో నాని క్యారెక్టర్ కనిపిస్తుందే గానీ నాని ఎక్కడా కనిపించడు. ఆయన ఏకంగా ప్రేక్షకుల కళ్లలో నీళ్లు తెప్పించాడంటే ఆయన నటన ఏ స్థాయిలో ఉందో అర్ధమవుతోంది. మొత్తానికి నాని డబుల్ హ్యాట్రిక్ పూర్తి చేసి 'నిన్నుకోరే'తో ట్రిపుల్ హ్యాట్రిక్‌కి శ్రీకారం చుట్టాడని ఒప్పుకోవాలి....!