కాజల్ అగర్వాల్ 'లక్ష్మి కళ్యాణం' సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. అప్పటి నుండి ఎన్నో ఎత్తు పల్లాలు చవిచూసిన కాజల్ టాలీవుడ్ లో ఒకొనొక టైములో టాప్ ప్లేస్ కి చేరింది. కాకపోతే మొన్నామధ్యన టైం కలిసిరాక కాస్త ఖాళీగా కూర్చుంది. కానీ చిరంజీవి రీఎంట్రీ మూవీ 'ఖైదీ నెంబర్ 150' తో మళ్లీ లైం టైమ్లోకి వచ్చేసింది. ఇక సినిమాలకు గ్యాప్ వచ్చినప్పుడు ఎన్టీఆర్ మీద అభిమానంతో 'జనతా గ్యారేజ్' లో ఒక ఐటెం కూడా చేసిందనుకోండి అది వేరే విషయం. ఇక 'ఖైదీ...'తో కాజల్ కాస్త బిజీ అయ్యింది. అటు తమిళంలోనూ ఇటు తెలుగులోనూ సినిమాలతో బిజీ అయిన కాజల్ ప్రస్తుతం రానా హీరోగా తేజ డైరెక్షన్ లో వస్తున్న 'నేనే రాజు - నేనే మంత్రి' చిత్రంలో నటిస్తుంది.
ఈ చిత్రంలో రానా, కాజల్ ల మధ్య రొమాంటిక్ సన్నివేశాలు పీక్ స్టేజ్ లో వున్నాయి. ఈ సన్నివేశాలు సినిమాకి ప్లస్ అవుతాయని అంటున్నారు. అయితే కాజల్ కి ఇండస్ట్రీలో ఒకానొక టైం లో అక్కినేని ఫ్యామిలీతో విభేదాలొచ్చాయనే టాక్ బాగా ప్రచారంలో ఉండేది. నాగ చైతన్య తో 'దడ' సినిమాలో కాజల్ హీరోయిన్ గా నటించిన టైం లో కాజల్ పై నాగార్జున గుర్రుగా ఉన్నాడనే వార్తలొచ్చాయి. అలాగే సినిమా ప్రమోషన్ లో కూడా పాలు పంచుకోకుండా కాజల్ బాగా డిస్టెన్స్ మెయింటింగ్ చేసింది. అయితే అది సర్దుమణిగాక కాజల్ కి నాగార్జున తన సినిమాలో ఒక ఆఫర్ ఇవ్వగా దాన్ని కాజల్ కావాలనే తిరస్కరించినట్లు కూడా వార్తలొచ్చాయి.
అప్పటి నుండి అక్కినేని ఫ్యామిలీతో కాజల్ దూరంగానే ఉంటూ వచ్చింది. అయితే ఇప్పుడు కాజల్ పై ఒక న్యూస్ ఫిలింనగర్ సర్కిల్స్ లో హల్చల్ చేస్తుంది. అదేమిటంటే కాజల్, నాగార్జున నటిస్తున్న 'రాజు గారి గది 2' లో గెస్ట్ రోల్ చేస్తుందనే న్యూస్ ఇపుడు సోషల్ మీడియాలో స్ప్రెడ్ అయ్యింది. మరి కాజల్ తో పాటే ఈ చిత్రంలో మరో హీరోయిన్ సమంత కూడా కీ రోల్ ప్లే చేస్తుండడం విశేషం. అయినా కాజల్, నాగార్జున మూవీలో నటిస్తుందంటే అక్కినేని అభిమానులకు మాత్రం కాస్త ఆశ్చర్యంగానే వుంది.