టాలీవుడ్ లో శ్రీదేవి, జయప్రద, జయసుధ, రమ్యకృష్ణ, విజయశాంతి వంటి హీరోయిన్స్ తో సినిమాలు చేసి వాళ్ళని టాప్ హీరోయిన్స్ గా తీర్చిదిద్దిన కె రాఘవేంద్ర రావు పై ఇప్పుడొక హీరోయిన్ సెటైర్స్ వేసింది. ఆమె ఎవరో కాదు టాలీవుడ్ లో ఐరెన్ లెగ్ గా ముద్ర వేయించుకుని బాలీవుడ్ కి చెక్కేసింది. అక్కడేదో రెండు హిట్స్ పడగానే ఇక తెలుగుని చాలా చులకన చేసి మాట్లాడుతున్న హీరోయిన్ ఎవరో కాదు తాప్సి పన్నునే. ఇప్పటికే టాలీవడ్ పై విమర్శలు చేస్తున్న ఈవిడగారు ఇప్పుడు ఏకంగా తనని ఇండస్ట్రీకి పరిచయం చేసిన టాప్ డైరెక్టర్ ని అలా కామెంట్ చెయ్యడం ఏమిటో అర్ధకాకుండా పోయింది.
రాఘవేంద్ర రావు 'ఝుమ్మంది నాథం' చిత్రంలో మంచు మనోజ్ కి జోడిగా టాలీవుడ్ కి పరిచయం చేసిన తాప్సి ఇప్పుడు ఆ సినిమాపై, ఆ డైరెక్టర్ రాఘవేంద్ర రావు పై బాలీవుడ్ లో కూర్చుని అక్కడవారితో కామెంట్స్ చేస్తూ జోక్స్ వేసుకుంటూ విరగబడి నవ్వుతుంది. ఇంతకీ రాఘవేంద్రుడిపై తాప్సి చేసిన కామెంట్స్ ఎలా ఉన్నాయో మీరే చూడండి. తాప్సి బాలీవుడ్ లో ఒక ఛానల్ లో కూర్చుని ఇంటర్వ్యూ ఇస్తూ టాలీవుడ్ లో నన్ను పరిచయం చేసిన రాఘవేంద్ర రావు గారు శ్రీదేవి, జయప్రదల వంటి వారిని స్టార్ హీరోయిన్స్ ని చేశాడు. ఇక ఆయన సినిమాల్లో పూలకి పళ్ళకి ఎంత చోటిస్తాడో తెలిసిందే అంటూనే.... ఆయన చూపంతా ఎప్పుడూ హీరోయిన్స్ నాభి మీదే ఉంటుందని సంచలనంగా మాట్లాడింది.
అంతే కాకుండా శ్రీదేవి వంటి వారని పూలతో పళ్లతో కొట్టిన ఈ డైరెక్టర్ నన్ను దేనితో కొడతాడా అని అనుకుంటూ మొదటి రోజు షూటింగ్ కి హాజరయిన నాపై మొదటి రోజే సాంగ్ షూట్ చేశారు ఇక ఆ సాంగ్లో నా నాభిపై ఆయన కొబ్బరి చిప్పలు వేయించారు. అది చూసి నేను షాకయ్యా. కానీ శ్రీదేవిలా నాకు స్టార్ డమ్ వచ్చేస్తుందేమో అని సంబరపడ్డా... అని తాప్సి చెబుతుండగానే 'ఝుమ్మంది నాథం' సినిమాలోని తాప్సి కొబ్బరి చిప్పల సాంగ్ అక్కడ ప్లే చెయ్యడంతో దానిని చూసి అక్కడున్నవారంతా వెకిలిగా నవ్వేశారు. వారితో పాటు తాప్సి కూడా అలానే నవ్వేసి రాఘవేంద్ర రావు ని కించపరిచేసింది.
మరి టాప్ డైరెక్టర్ అయిన రాఘవేంద్రుడు హీరోయిన్స్ నాభి మీదే పూర్తి దృష్టి పెట్టినట్లయితే ఆయన అంత టాప్ డైరెక్టర్ అయ్యేవాడా. టాలీవుడ్ లో మూడు నాలుగు సినిమాలతోనే దుకాణం బంద్ చేసి బాలీవుడ్ మాత్రమే ఇండస్ట్రీ అంటూ అక్కడ తిష్ట వేసుకుని అన్నం పెట్టిన చేతినే ఇప్పుడు ఇలా దారుణంగా అవమానించడం సరికాదనే వాదన టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ నుండి వినిపిస్తోంది. బాలీవడ్ లో సినిమాలు హిట్ అవగానే ఇలా ఎలా మారిపోతారంటూ కూడా తాప్సిని శాపనార్ధాలు పెడుతున్నారు కొంత మంది.