మనవారు పండుగలు, సెలవులు వస్తే పండగ చేసుకుంటారు. స్టార్స్ చిత్రాలన్నీ సంక్రాంతి, వేసవి, దసరా వంటివాటిని ముందుగా ప్లాన్ చేసుకుంటారు. కానీ యంగ్ హీరోలు, చిన్నహీరోలు మాత్రం ప్రతి శుక్రవారాన్ని, ప్రతి వీకెండ్‌ని ఫాలో అవుతారు. ఇంకొందరు మీడియం రేంజ్ హీరోలు సోలోగా రావాలని ప్లాన్ చేస్తుంటారు. ఇక ఏకంగా ఐదు రోజుల వీకెండ్ వస్తే ఊరుకుంటారా? అది ఆగష్టు11 నుంచి రానుంది.
మంగళవారం వరకు శని, ఆది, ఆ తర్వాత ఇండిపెండెన్స్ డే వంటివి వచ్చాయి. ఈ తేదీని క్యాష్ చేసుకోవాలని స్టార్స్ ప్లాన్ చేసినా అది వర్కౌట్ కాలేదు. దీంతో ఆగష్టు11న లాంగ్ వీకెండ్ సందర్భంగా నితిన్-హనురాఘవపూడిల'లై', బోయపాటి శ్రీను-బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ల 'జయ జానకి నాయకా' విదుదల పక్కా అయింది. తాజాగా రానా-తేజల కాంబినేషన్‌లో రూపొందిన 'నేనే రాజు...నేనే మంత్రి'చిత్రాన్ని కూడా అదే తేదీన విడుదల చేయడానికి నిర్ణయించారు.
ఇక సురేష్‌బాబు, 14రీల్స్ అధినేతలు, బెల్లంకొండ సురేష్‌లకు కూడా మంచి పట్టు ఉండటంతో ధియేటర్ల ఇబ్బంది వచ్చే ప్రశ్నేలేదు. మూడు మూడు విభిన్నమైన జోనర్స్ కావడం, కాస్త అటు ఇటుగా ఈ హీరోలందరి క్రేజ్ సమానమే కాబట్టి ఏ చిత్రం ప్రేక్షకులు దానికి ఉన్నారు. తాజాగా నాగ చైతన్య నటిస్తోన్న 'యుద్దం శరణం' కూడా ఆగష్టు11నే వస్తుందని వార్తలు వస్తున్నాయి. 'జయ జానకి నాయకా' 40కోట్లు, 'లై' 35 కోట్లు, 'నేనే రాజు .. నేనే మంత్రి' 15 నుంచి17కోట్లు, 'యుద్దం శరణం' దాదాపు 20కోట్లపైగా బడ్జెట్‌తో తెరకెక్కాయి.
వీటన్నింటి విలువ 125 కోట్ల దాకా ఉండవచ్చని అంటున్నారు. ఇప్పటికే మూడు చిత్రాలు కన్‌ఫర్మ్ కాగా నాగ చైతన్య 'యుద్దం శరణం' మీద అఫీషియల్ న్యూస్ రావాల్సిఉంది. మరి ప్రేక్షకులు ఏ చిత్రాన్ని నిలబెడతారు? ఏ చిత్రానికి పట్టం కడతారు? అనేవి ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఇక ఆగష్టు11 నుంచి అన్ని చిత్రాలను మిస్‌కాకుండా చూసే సినీ ప్రేమికులకు పండగనే చెప్పాలి....!