నాగచైతన్య 'ప్రేమమ్, రారండోయ్ వేడుక చూద్దాం'లతో మంచి ఊపులో ఉన్నాడు. కానీ ఇప్పటి వరకు అన్ని క్లాస్ చిత్రాలే ఎక్కువగా ఆడాయి కానీ మాస్ మాత్రం ఆయనకు ఒంటపట్టలేదు. అలా ప్రయత్నించిన ప్రతి సారీ పరాజయమే పలకరించింది. కానీ చైతూ మాత్రం మాస్‌ని వదిలేలా లేడు. 'తడాఖా'లో మాస్‌గా కనిపించినా అందులో ఆయన సోలో కాదు. ఇక చైతు తన మొదటి చిత్రం 'జోష్, 100%లవ్' సినిమాలలో కాలేజీ స్టూడెంట్‌గా కనిపించాడు.
తాజాగా ఆయన కృష్ణ వైరిముత్తు అనే దర్శకుడిని పరిచయం చేస్తూ 'యుద్దం శరణం' చేస్తున్నాడు. ఇది కాలేజీ బ్యాక్‌డ్రాప్‌లో నడిచే చిత్రమట. టైటిల్‌లాగానే సినిమాలో కూడా మాస్ మసాలా అంశాలు బోలెడున్నాయంటున్నాడు. ఈ కథను మావయ్య వెంకటేష్ నాకు సజెస్ట్ చేశాడు.ఇంత వరకు నేను చేసిన చిత్రాలల్లో ఇందులో నేను ఇప్పటి వరకు చేయని విధంగా యూత్‌ని టార్గెట్ చేశాను. నా కెరీర్‌లో అత్యంత యూత్‌ఫుల్ మూవీ ఇది. యంగ్‌స్టర్స్ మెచ్చేలా స్క్రిప్ట్‌లో మార్పులు చేర్పులు చేసి స్క్రిప్ట్ రూపొందించాం.. అంటూ ఈ చిత్రం గురించి చెప్పుకొచ్చాడు.
ఇక తన నాన్న నాగార్జున సలహాలను కూడా ఎప్పటి కప్పుడు స్వీకరిస్తానన్నాడు. ఇక నాకు వరుస విజయాలు రావడానికి కారణం...నేను ఏ సబ్జెక్ట్‌లకు సూట్ అవుతాను. వేటికి సెట్ కాను అనేది తెలుసుకున్నాను.నాలోని ప్లస్‌లు, మైనస్‌లపై ఓ అవగాహన వచ్చింది. ప్రతి ఒక్కరికి వైఫల్యాలు ఎదురయితేనే ఎలా ఉండాలి? అనేది వంట పట్టించుకున్నాను. అభివృద్ది చెందాలంటే తప్పని సరిగా ఎదురు దెబ్బలు తినాలి.
త్వరలో కోలీవుడ్‌కి ఎంట్రీ ఇస్తున్నాను. బాలీవుడ్ సంగతి మాత్రం ఇప్పటి వరకు ఆలోచించలేదన్నాడు.ఇక ఆయన తండ్రి నాగ్ 'రారండోయ్ వేడుక చూద్దాం' విడుదలకు ముందు నాకు 'నిన్నేపెళ్లాడతా'ఎలానో చైతూకి ఈ చిత్రం అలాంటిదని పేర్కొన్నాడు. ఇది నిజమైంది.కాగా అక్కినేని ఫ్యాన్స్ ఈ 'యుద్దం శరణం' చిత్రం చైతూకు ఓ 'శివ' అవుతుందంటున్నారు. మరి వారి నోటి వాక్కు ఫలిస్తుందో లేదో చూడాలి.మొత్తానికి ఈ చిత్రం చైతూకి మాస్ ఇమేజ్ తేవడం మాత్రం గ్యారంటీ అంటున్నారు.