తాజాగా ఎన్టీఆర్ నటించిన 'జై లవకుశ'లోని నెగటివ్ షేడ్స్ ఉన్న జై పాత్రను చూపిస్తూ మొదటి టీజర్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ టీజర్‌లో ఎన్టీఆర్ చూపించిన హావభావాలు, డైలాగ్‌లు చెప్పేటప్పుడు నత్తిగా మాట్లాడటం వంటివి చూసి ఎన్టీఆర్ అభిమానులు, సామాన్య సినీ ప్రేక్షకులే కాదు.. సినీ సెలబ్రిటీలు కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటికే రాజమౌళి, హరీష్‌శంకర్, కొరటాల శివలు టీజర్ చూసి ఫిదా అయిపోయారు. ఇక దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు తాజాగా చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. సోషల్‌మీడియాలో పెద్దగా హడావుడి చేయని దర్శకేంద్రుడు పనిగట్టుకుని మరీ ఎన్టీఆర్‌ని ప్రశంసలలో ముంచెత్తాడు.
'ఆ రావణున్ని చంపాలంటే సముద్రం దాటాల... ఈ రావణున్ని సంపాలంటే సముద్రమంత ద.ద..ద..ధైర్యం ఉండాల..' అనే శాంపిల్ డైలాగే ఇంతలా అదరగొడుతుంటే ఇక సినిమా మొత్తంలో ఆ పాత్ర సృష్టించబోయే సునామీ గురించి ఇప్పటినుంచే ఎదురు చూపులు మొదలయ్యాయి. ఈ సందర్భంగా రాఘవేంద్రరావు ట్వీట్ చేస్తూ.. ఇలాంటి పాత్రలు చేయాలంటే ద..ద..దైర్యం ఉండాలా, ఆ ధైర్యం మా తారక్‌కి ఉంది. ఆ ధైర్యాన్ని తెరమీద చూసేందుకు నేను కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.. అంటూ ట్వీట్ చేశాడు.
ఈ ట్వీట్‌ని రీట్వీట్ చేస్తూ పలువురు రాఘవేంద్రరావు ట్వీట్‌కి మద్దతు చెబుతున్నారు. ఇంటర్నెట్‌లో సునామీ సృష్టిస్తోన్న టీజర్‌కి రెస్పాన్స్ చూసి ఎన్టీఆర్ చాలా ఆనందంగా ఉన్నాడు. ఆయన ట్వీట్ చేస్తూ అభిమానులు, సన్నిహితులు, మీడియా, సినీప్రముఖుల నుంచి వస్తున్న ప్రేమ, ఆదరణ, స్పందన వంటి ఫీడ్‌బ్యాక్‌లని చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఇంతకంటే మెరుగైన నటన చేసేందకు కృషి చేస్తాను.. థాంక్యూ టూఆల్ అని ట్వీట్ చేశాడు. ఈ టీజర్ 100 నిమిషాలలోనే 100కె లైక్స్‌ని సాధించిన రికార్డు సృష్టించింది.