Advertisementt

మరో కమెడియన్ కి పవన్ కళ్యాణ్ వార్నింగ్..!

Sun 09th Jul 2017 11:47 AM
pawan kalyan,warning,trivikram srinivas,comedian  మరో కమెడియన్ కి పవన్ కళ్యాణ్ వార్నింగ్..!
Pawan Kalyan Warning to Another Comedian మరో కమెడియన్ కి పవన్ కళ్యాణ్ వార్నింగ్..!
Advertisement
Ads by CJ

షూటింగ్ లో ఎప్పుడూ అందరితో  సరదాగా ఉండే పవన్ కి ఇప్పుడొకరిమీద కోపం వచ్చినట్లు చెబుతున్నారు. మరి ఎప్పుడూ కూల్ గా వుండే పవన్ కళ్యాణ్ కి అంతగా కోపం తెప్పించింది ఎవరా అని అందరూ అప్పుడే తెగ చర్చించేసుకుంటున్నారు. త్రివిక్రమ్ - పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం షూటింగ్ స్పాట్ లో పవన్ కి ఒక స్టార్ కమెడియన్ మీద కోపం వచ్చినట్లు చెబుతున్నారు. కేవలం కోపం రావడమే కాకుండా ఆ కమెడియన్ కి పవన్ సీరియస్ గా వార్నింగ్ కూడా ఇచ్చినట్లు చెబుతున్నారు.

అయితే ఆ కమెడియన్ ఎవరనే ప్రస్తుతానికి సస్పెన్సు గాని  ఆ కమెడియన్ ఇంతకుముందు త్రివిక్రమ్ తెరకెక్కించిన 'అ.. ఆ' సినిమాలో ఫుల్ లెంత్ కామెడీ రోల్ చేశాడని చెబుతున్నారు. ఆ చిత్రంలో అతను చేసిన కామెడీకి మెచ్చి త్రివిక్రమ్ మళ్ళీ పవన్ సినిమాలోనూ ఛాన్స్ ఇచ్చాడని చెబుతున్నారు. ఇకపోతే ఆ కమెడియన్ వలన పవన్ కి అంతగా కోపం రావడానికి కారణం మాత్రం రకరకాలుగా ప్రచారంలోకి వచ్చింది. షూటింగ్ గ్యాప్ లో పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కలిసి స్క్రిప్ట్ డిస్కస్ చేస్తుండగా... మద్యలో ఆ కమెడియన్ వచ్చి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ విశేషాలు మాట్లాడుతుండడంతో పవన్ కి పిచ్చ కోపం వచ్చి అతనికి అక్కడే వార్నింగ్ ఇచ్చాడంటున్నారు.

ఇక పవన్ కళ్యాణ్ ఇలా కమెడియన్స్ కి వార్నింగ్ ఇవ్వడం ఇదే మొదటిసారి కాదంటున్నారు. ఇంతకుముందు కూడా పవన్ కళ్యాణ్  'సర్దార్ గబ్బర్ సింగ్' టైం లో జబర్దస్త్ ఫేమ్ షకలక శంకర్ పై కూడా మండిపడినట్లు వార్తలొచ్చాయి. అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇచ్చిన కమెడియన్ పవన్ సినిమాలో ఇకముందు కనబడతాడో లేదో కూడా డౌట్ అంటున్నారు సినీ జనాలు.

Pawan Kalyan Warning to Another Comedian:

Pawan Kalyan Warns to top Comedian in His Trivikram movie Sets

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ