తాజాగా రెండు రోజుల నుంచి నాగార్జున వైసీపీలో చేరుతాడనే వార్తలు వస్తున్నాయి. కానీ నాగ్ రాజకీయాలలోకి వెళ్లే అవకాశమే లేదని ఆయనను బాగా తెలిసిన వారు చెబుతారు. గతంలో ఆయన్ను మీరు ఏ పార్టీ అంటే అధికార పార్టీ అని చెప్పాడు. ఆయన చెప్పిన లాజిక్ ఏమిటంటే.. అధిక శాతం ప్రజలు తాము ఏ పార్టీని గెలిపిస్తే, ఏ రాజకీయనాయకుడిని గెలిపిస్తే తమకు మంచి చేస్తాడని భావించి ఓటేస్తారు.కాబట్టి మెజార్టీ ప్రజల అభిప్రాయం ప్రకారమే మనం నడవాలి...అని లౌక్యంగా స్పందించాడు.
ఇక నాగ్‌కి తెలంగాణలోని టీఆర్‌ఎస్‌తో మంచి సంబంధాలున్నాయి. 2014 ఎన్నికల్లో మోదీ గెలుస్తాడని భావించి, ఆయనను ముందుగానే కలిశాడు.ఇక వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఉన్నప్పుడు ఆయన ప్రవేశపెట్టిన పలు సంక్షేమ పథకాలకు ఆయన ప్రచారంచేశాడు.నాగ్.. జగన్‌కే కాదు.. అందరికీ సన్నిహితుడే, ఆయనది పక్కా బిజినెస్ మైండ్. దానిలో తప్పు కూడా లేదు. కాబట్టి ఎవ్వరినీ శత్రువుని చేసుకోడు.
చంద్రబాబు, పవన్, జగన్ ఇలా అందరితో ఆయనకు మంచి స్నేహం ఉంది. కావాలంటే ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేయకుండా ఎవరైనాహుందాగా రాజ్యసభకు పంపి ఎంపీని చేస్తానంటే ఒప్పుకుంటాడే గానీ ఆయన ఏ పార్టీలోనో చేరి బురద అంటించుకోడని ఆయన మనస్తత్వం తెలిసిన వారు అంటున్నారు. బహుశా అవకాశం వస్తే, తమకు సీటిస్తే తన భార్య అమలను గుంటూరు నుంచి లేదా విజయవాడ నుంచి ఎమ్మేల్యే లేదా ఎంపీ సీటుకి నిలబెట్టే అవకాశాన్ని మాత్రం తోసిపుచ్చలేం....!