Advertisementt

ఉల్లాసంగా.. ఉత్సాహంగా తలైవా..!

Sat 08th Jul 2017 04:52 PM
rajinikanth,usa,selfie video,social media  ఉల్లాసంగా.. ఉత్సాహంగా తలైవా..!
Rajinikanth's Posted Selfie Video in Social Media ఉల్లాసంగా.. ఉత్సాహంగా తలైవా..!
Advertisement
Ads by CJ

తాజాగా రజినీకాంత్‌ అమెరికాకి వెళ్లడంతో ఆయనకు ఆరోగ్యం మరలా పాడైందని, ట్రీట్‌మెంట్‌ కోసమే అమెరికా వెళ్లాడనే ప్రచారం మొదలైంది. కానీ దానికి రజినీ తాజాగా చెక్‌ పెట్టాడు. రజినీ నిజ జీవితంలో చాలా సామాన్యంగా ఉంటాడు. ఆయన తనకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం గురించి అవగహన లేదని, తనకు కొత్త కొత్త మొబైల్స్‌ వాడటం, సోషల్‌ మీడియాలో చురుగ్గా ఉండటం, ట్విట్టర్‌ ఫేస్‌బుక్‌లను ఆపరేట్‌ చేయడం చేతకాదని, తనను అభిమానించేవారితో ముఖాముఖిగా మాట్లాడినంత ఆనందం ట్విట్టర్‌, ట్వీట్స్‌, ఫేస్‌బుక్‌ల ద్వారా రాదని ఆయన నమ్ముతాడు. 

తన చేతిలోని మొబైల్‌ కేవలం తాను కాల్‌ చేయడానికి, లేదా ఎవరైనా కాల్‌ చేస్తే మాట్లాడేంత వరకు తెలుసని ఆమధ్య ఓపెన్‌గానే చెప్పాడు, హిమాలయాలకు వెళ్లినప్పుడే కాదు.. తన సినిమా షూటింగ్స్‌ సమయంలో కూడా అందరితో కలిసి నించొని, ప్లేట్‌ చేతబట్టుకుని నిలబడే తింటాడు. తాజాగా దీనికి సంబంధించి మరో న్యూస్‌ ఇప్పుడు వైరల్‌ అవుతోంది. ఆయన అమెరికాలో మరో వ్యక్తి డ్రైవ్‌ చేస్తుండగా, ఓపెన్‌టాప్‌ ఫెరారీలో కూర్చుని తన సెల్ఫీ వీడియోను తీసి సోషల్‌మీడియాలో పెట్టాడు. 

ఈ సందర్భంగా ఆయన కారు డ్రైవ్‌ చేస్తున్న వ్యక్తితో తమిళంలో ఎలా సెల్ఫీ వీడియో తీయాలో అడిగి మరీ వాటిని తీసి అభిమానులకు పంపడం చూస్తే అంత గొప్ప స్టార్‌కి సెల్ఫీ వీడియో, సెల్‌ఫోన్‌ వాడటం కూడా రాదా? అని చాలామంది ఆశ్చర్యపోతున్నారు. ప్రపంచం ఎటు వెళ్తున్నా తనదైన విలువలు పాటిస్తున్న తలైవా తన వ్యక్తిత్వం ద్వారానే పాపులర్‌ అయ్యాడని చెప్పక తప్పదు. ఆయనది సింపుల్‌ లివింగ్‌ స్టైల్‌ అని ఈ వీడియోచూస్తే అర్ధమవుతుంది...! 

Rajinikanth's Posted Selfie Video in Social Media:

While he was driving another man in the US, he sit in an open-ended Ferrari and pulled his selfie video into a social media.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ