అన్నం ఉడికిందా? లేదా? అని తెలుసుకోవాలంటే అన్నం మొత్తాన్ని చూడాల్సిన పనిలేదు. ఒక్క మెతుకు పట్టుకుంటేనే ఉడికింది లేనిదీ తెలిసిపోతుంది. ఇక 'భలే మంచి రోజు'తో మంచి టాలెంట్ ఉన్న దర్శకునిగా శ్రీరామ్ ఆదిత్యకు పేరు వచ్చింది. కాగా ఆయన రెండో చిత్రం 'శమంతకమణి' మరింత ఆసక్తిని రేపుతోంది. ఒక హీరోతో చేయడానికే ఎంతో కాలం షూటింగ్ చేసే దర్శకులు ఉన్న రోజుల్లో ఈయన బిజీ అయిన ముగ్గురు యంగ్ హీరోలతో ఓ చిత్రాన్ని తక్కువ సమయంలో చేయడం నిజంగా అభినందనీయం.
ఇక ఈ చిత్రంలో నటించే నలుగురు హీరోలు కూడా యంగ్ హీరోలు మాత్రమే కావడంతో దీనిని మల్టీస్టారర్ అని పిలవలేం. కానీ ఈ చిత్రం మోషన్‌పోస్టర్ నుంచి ఫస్ట్‌లుక్, టీజర్, ట్రైలర్ల ద్వారా మంచి ఆసక్తిని రేకెత్తిసోంది. ఇక 'శమంతకమణి' అనేది ఓల్డ్ వింటేజ్ కారు అని వార్తలు వస్తున్నాయి. నారా రోహిత్ పోలీసుగా, ఆది సాయి కుమార్ కాలేజీ స్టూడెంట్‌గా, సుధీర్ బాబు బిజినెస్ మ్యాగ్నెట్‌గా నటిస్తున్న ఇందులో సందీప్ కిషన్ సినిమా పిచ్చోడిగా నటించనున్నాడు.
మరోవైపు ఇందులో రాజేంద్రప్రసాద్‌తో పాటు హీరోయిన్లుగా నటిస్తున్న చాందిని చౌదరి, అనన్య, జెన్నీలు నటిస్తున్నారు. మరి నలుగురు హీరోలుంటే కేవలం ఒక హీరోయిన్ తక్కువైందంటే ఆ హీరోకు హీరోయిన్ లేదని తెలుస్తోంది. మరోవైపు మంచి అభిరుచి కలిగిన నిర్మాత ఆనంద్‌ప్రసాద్ తన భవ్య క్రియేషన్స్‌బేనర్‌లో నిర్మిస్తున్నాడు కాబట్టి ప్రమోషన్లు, సినిమాని థియేటర్లలో నిలబెట్టడం వంటివి ఆయనే చూసుకుంటాడు. మొత్తానికి ఈ చిత్రం హిట్టయితే ఎంతో కాన్ఫిడెంట్‌గా ఉన్న దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య కూడా బిజీగా మారడం ఖాయంగా అనిపిస్తోంది.