హరీష్ శంకర్ కి నోటి దూల బాగా ఎక్కువే. దువ్వాడ ప్లాప్ టాక్ తో హరీష్ కు చిర్రెత్తుకొచ్చింది. అందుకే మీడియాని వీలున్నప్పుడల్లా ఏకి పారేస్తున్నాడు. డిజె చిత్రం విడుదలైన మొదటి షో కే ప్లాప్ టాక్ తెచ్చుకుంది. ఏదో హరీష్, అల్లు అర్జున్ అదృష్టం బాగుండి కలెక్షన్స్ కుమ్మేస్తున్నాయి. అయితే ఆ కలెక్షన్స్ ఫేక్ అనే వాదన లేకపోలేదు. అందుకే ఈసారి హరీష్ శంకర్ ట్విట్టర్ వేదికగా మరోసారి చెలరేగిపోయాడు. నైజంలో డిజె చిత్రం 20 కోట్లు కొల్లగొట్టిందని... అది అబద్ధమని నిరూపిస్తే సినిమాలు చెయ్యడమే మానేస్తానని ఛాలెంజ్ విసురుతున్నాడు.
అయితే హరీష్ అలా డిజె చిత్రం కోసం మీడియా మీద ఫైటింగ్ కి దిగడం అల్లు అర్జున్ కి ఇబ్బందులు కలిగిస్తుందని అంటున్నారు. ఇప్పటికే చెప్పను బ్రదర్ అని ఇరుకుల్లో పడ్డ బన్నీకి దాని నుండి బయటపెడెందుకు చెయ్యని ప్రయత్నం లేదు. మళ్లీ ఇప్పుడు బన్నీ కూడా రివ్యూస్ మీద కామెంట్ చేశాడు కానీ పదే పదే ఏం మాట్లాడలేదు. కానీ హరీష్ మాత్రం వదలడం లేదు. మరి ఇలా హరీష్ ప్రతి విషయాన్నీ బూతద్దంలో పెట్టి చూసి ఓవర్ యాక్షన్ చేస్తే ఆ ఎఫెక్ట్ ఒక్క హరీష్ మీదే కాదు బన్నీ మీద కూడా పడుతుందిగా.... మరి అది ఆలోచించకుండా మనోడు జనాల మీద చూపెట్టలేని కోపాన్ని ఆ కసిని మీడియా మీద ప్రదర్శించడం ఎంత వరకు కరెక్ట్ అంటున్నారు.
ఓవర్సీస్ లో డిజె సరిగ్గా ఆడకపోవడానికి కారణం డిజె రివ్యూ లే కారణం అంటూ మీడియా మీద విరుచుకుపడుతున్నాడు. మౌత్ టాక్ బాగోకపోతే రివ్యూస్ మాత్రం ఏం చేస్తాయి. కేవలం రివ్యూ చూసే సినిమాలకు వెళ్లారు కదా ప్రేక్షకులు. మౌత్ టాక్ బాగుంటే సినిమాలకు వెళతారు. అందుకు ఉదాహరణ అల్లు అర్జున్ సినిమానే. సరైనోడు సినిమా రివ్యూస్ బ్యాడ్ గా వచ్చినప్పటికీ మౌత్ టాక్ బాగుండబట్టేగా సినిమా ఆడేసింది. ఇప్పటికైనా హరీష్ కాస్త తగ్గితే బెటర్ అంటున్నారు.