మహేష్ బాబు, మురుగదాస్ కాంబినేషన్లో 'స్పైడర్' చిత్రం మొదలుపెట్టినప్పటి నుండి సినిమా షూటింగ్ ఏకధాటిగా జరుగుతున్నప్పటికీ అనుకున్న టైంకి సినిమా కంప్లీట్ కాలేదు. కారణం మురుగదాస్ కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ కాకపోవడమనే టాక్ బాగా వినబడుతుంది. ఇక 'స్పైడర్' చిత్రానికి మహేష్ డేట్స్ పూర్తయినప్పటికీ షూటింగ్ డిలే వలన మళ్ళీ కొన్ని డేట్స్ మహేష్ అడ్జెస్ట్ చెయ్యాల్సి వచ్చింది. ఇక రెండు పాటల మినహా ప్రస్తుతానికి 'స్పైడర్' షూటింగ్ పూర్తికానుండడంతో మహేష్ ఇప్పుడు తన తదుపరి చిత్రంపై దృష్టి సారించాడు.
మహేష్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ 'భరత్ అను నేను' చిత్రాన్ని కొరటాల డైరెక్షన్ లో చేస్తున్న విషయం తెలిసందే. ఇక 'భరత్ అను నేను' సినిమా షూటింగ్ విషయంలో మహేష్ ఈసారి పక్కా ప్లానింగ్ తో ఉన్నాడట. 'స్పైడర్' షూటింగ్ ఆలస్యాన్ని దృష్టిలో పెట్టుకుని 'భరత్ అను నేను' షూటింగ్ విషయంలో అలా జరగకుండా.. ఈ చిత్రాన్ని ఎలాగైనా నవంబర్ కల్లా షూటింగ్ కంప్లీట్ చేసి డిసెంబర్ లో ఆడియో విడుదల చేసి వచ్చే సంక్రాంతికి సినిమా విడుదల చెయ్యాలనే సంకల్పంతో మహేష్ ఈ చిత్ర షూటింగ్ కంటిన్యూగా జరిగేలా కాల్షీట్లు కేటాయించినట్టు ఫిల్మ్‌నగర్ సమాచారం.
ఇక కొరటాల - మహేష్ కాంబోలో వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే వున్నాయి. ఇందులో మహేష్ బాబు తొలిసారి పొలిటీషియన్‌గా కనిపించనుండడంతో... ఈ చిత్రంలో మహేష్ లుక్ ఎలా వుంటుందనే క్యూరియాసిటీ అభిమానుల్లో నెలకొంది. ఇక ఈ చిత్రంలో మహేష్ కి జోడిగా బాలీవుడ్ భామ కైరా అద్వానీ నటిస్తుంది.