Advertisementt

'జై' టీజర్ పై రాజమౌళి ఏమన్నాడంటే...?

Fri 07th Jul 2017 05:43 PM
ss rajamouli,jai teaser,jr ntr,jai lava kusa  'జై' టీజర్ పై రాజమౌళి ఏమన్నాడంటే...?
Rajamouli Praises Jr NTR Jai Teaser 'జై' టీజర్ పై రాజమౌళి ఏమన్నాడంటే...?
Advertisement
Ads by CJ

'జై లవ కుశ' మొదటి 'జై' టీజర్ వచ్చేసింది. 'జై' టీజర్ తో ఎన్టీఆర్ దుమ్ము రేపడం స్టార్ట్ చేశాడు. బాబీ డైరెక్షన్ లో కళ్యాణ్ రామ్ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న 'జై లవ కుశ' చిత్రం టీజర్స్ ని మూడు భాగాలుగా విడుదల చేస్తున్నారు చిత్ర టీమ్. 'జై' గా ఒక టీజర్ ఆల్రెడీ వచ్చేసింది. ఇక 'లవ, కుశ' టీజర్స్ రావాల్సి వుంది. ఒక్క 'జై' టీజర్ తోనే ఎన్టీఆర్ విలనిజాన్ని పీక్ స్టేజ్ లో పరిచయం చేసాడు డైరెక్టర్ బాబీ. అందులోని ఎన్టీఆర్ డైలాగ్ కి కూడా విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది.

ఇక ఈ టీజర్ ని తిలకించిన ఎన్టీఆర్ కి అత్యంత సన్నిహితుడుగా పేరున్న జక్కన ఈ టీజర్ పై ఒక ట్వీటేశాడు. తనకు టీజర్ ఎంత నచ్చిందో తన మనసులోని మాటను ట్విట్టర్ లో పెట్టాడు రాజమౌళి. జై టీజర్ తోనే సినిమాకి పబ్లిసిటీ ప్రారంభిచేసావ్ అంటూ.... తారక్ టీజర్ చాలా బాగుంది. సూపర్... ఓ రకంగా సినిమాకు ఇలా ప్రచారం ప్రారంభించేశావ్.. సూపర్ అంటూ స్పందించాడు. మరి టీజర్ ని అలా విడుదల చేసారో లేదో రాజమౌళి ఇలా దాని గురించి స్పందించడం చూస్తుంటే ఆయన ఇతర సినిమాల విశేషాలను ఎంత దగ్గరగా వాచ్ చేస్తున్నాడో కదా అంటున్నారు.

మరి టాలీవుడ్ టాప్ డైరెక్టర్ అయిన రాజమౌళి 'జై' టీజర్ పై స్పందించాడు అంటే సినిమాపై ఇంకెన్ని అంచనాలు పెరిగిపోతాయో అంటూ ఎన్టీఆర్ అభిమానులు అపుడే సెలెబ్రేషన్స్ స్టార్ట్ చేసేశారు. ఇక ఒక్క టీజర్ కే రెస్పాన్స్ ఈ రేంజ్ లో ఉంటే..ఆ రెండు టీజర్స్ కూడా వస్తే ఈ 'జై లవ కుశ' కు ఇప్పున్న క్రేజ్ 100 రేట్లు పెరిగిపోతుంది అంటున్నారు.

Rajamouli Praises Jr NTR Jai Teaser:

Rajamouli Reaction on Jr NTR Jai Lava Kusa Movie Jai Teaser

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ