Advertisementt

పవన్‌పై నితిన్‌ అభిమానం అలాంటిది మరి!

Fri 07th Jul 2017 04:57 PM
pawan kalyan,nithiin,pawan kalyan and nithiin photo  పవన్‌పై నితిన్‌ అభిమానం అలాంటిది మరి!
Pawan Kalyan Photo in Nithiin's Office Entrance పవన్‌పై నితిన్‌ అభిమానం అలాంటిది మరి!
Advertisement
Ads by CJ

తన చిన్ననాటి నుంచి పవన్‌ని ఇమిటేట్‌ చేస్తూ నటన నేర్చుకుని, ఆ నటన ద్వారానే తేజను మెప్పించి 'జయం'లో హీరోనైనానని నితిన్‌ తరచుగా చెబుతూ ఉంటారు. ఇక తాను కెరీర్‌ పరంగా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు 'ఇష్క్‌' వేడుకకు పవన్‌ రావడం, ఆ చిత్రం పెద్ద సక్సెస్‌కావడం, మరలా నితిన్‌ కెరీర్‌ గాడిలో పడిన సంగతి తెలిసిందే. ఇక తన చిత్రాల టైటిల్స్‌ను కూడా పవన్‌ చిత్రాలలోని పాటల నుంచి తీసుకుని, పవన్‌ నటించిన పాటలను రీమిక్స్ చేస్తూ, ఆయన మాదిరిగానే గెటప్‌లు వేస్తూ, ఆయన 'తమ్ముడు'లో కట్టినట్లుగానే తలకి గుడ్డతో కట్టి, నోటిలో బీడీ పెట్టుకుని తన తాజా చిత్రం 'లై'లో నితిన్‌ కనిపిస్తున్నాడు. 

ఇక నితిన్‌ తన సినిమాలలోనే కాదు.. ఎక్కడైనా సరే పవన్‌ ప్రస్తావన వచ్చిదంటే చాలు ఎమోషనల్‌ అయిపోతాడు. దీనికి తగ్గట్లుగా నితిన్‌ పట్ల పవన్‌ కూడా ఆదరణ చూపిస్తుంటాడు. నేడు నితిన్‌ని అభిమానించే ప్రేక్షకుల్లో ఎక్కువగా పవన్‌ ఫ్యాన్సే ఉంటారు. పవన్‌ కూడా తమ పెరట్లో పెంచిన మామిడికాయలను నితిన్‌కి పంపిస్తూ, నితిన్‌ పిలిచిన వేడుకలకు టైం ఉంటే ఖచ్చితంగా వచ్చి వెళ్తుంటాడు. 

కాగా త్వరలో పవన్‌, త్రివిక్రమ్‌లు కలిసి కృష్ణచైతన్య దర్శకత్వంలో నితిన్‌ హీరోగా ఓ చిత్రం కూడా నిర్మించే పనిలో ఉన్న సంగతి తెలిసిందే. కాగా నితిన్‌ నటించిన 'చిన్నదానా నీకోసం' వేడుకలో ఓ నితిన్‌ అభిమాని పవన్‌, నితిన్‌లను ఒకే ఫ్రేమ్‌లో పెయింటింగ్‌ వేసి బహుమతిగా ఇచ్చాడు. దీనిని నితిన్‌ తన ఆఫీసులోకి ఎంటర్‌కాగానే కనిపించేలా పెట్టుకుని తన అభిమానం గుండెల్లోనే కాదు.. అన్నిచోట్లా ఉందని నిరూపిస్తున్నాడు. 

కాగా నితిన్‌, హను రాఘవపూడిల 'లై' ఆగష్టు11న విడుదల కానుంది. మరి ఈ ఆడియో వేడుకకు పవన్‌ ఖచ్చితంగా వస్తాడనే వార్తలు బాగా హల్‌చల్‌ చేస్తున్నాయి. 

Pawan Kalyan Photo in Nithiin's Office Entrance:

Nithiin Love on Pawan Kalyan’s photo which was gifted by one of his fan.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ