తమిళంలో నయనతార నెంబర్ 1 పొజిషన్ లో కొనసాగుతుంది. సెలెక్టివ్ గా సినిమాలను ఎంచుకుంటూ హిట్ ట్రాక్ లో ఉన్న నయన్ తన రెమ్యునరేషన్ కూడా భారీ లేవల్లోనే వసూలు చేస్తూ నిర్మాతలకు చుక్కలు చూపెట్టే రకం. ఇక్కడ తెలుగులో ప్రస్తుతం నయనతార, బాలకృష్ణ - రవి కుమార్ చౌదరి కాంబినేషన్లో తెరకెక్కబోయే చిత్రంలో హీరోయిన్ గా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చెబుతున్నారు. దీనికిగాను నయన్ 4 కోట్లు వసూలు చేస్తుందనే టాక్ కూడా వుంది.
ఇకపోతే నయనతార ఇప్పుడు 1000 కోట్ల భారీబడ్జెట్ చిత్రంగా రాబోతున్న మహాభారతంలో నటించబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. శ్రీ మీనన్ డైరెక్షన్ లో బడా బిజినెస్ మాన్ 1000 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ మహాభారతాన్నితెరకెక్కించబోతున్నాడు. ఇక ఈ మహాభారతంలో ఇప్పటికే మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ భీముడి పాత్రకి ఎంపిక కాగా మిగతా పాత్రలకు కూడా నటీనటుల ఎంపిక జరుగుతుందట. అయితే ఈ చిత్రంలో పాంచాలి పాత్ర కోసం నయనతార ని మూవీ యూనిట్ సంప్రదించినట్లు ప్రచారం జరుగుతుంది.
టాలీవుడ్ లో శ్రీరామరాజ్యంలో సీతగా మెప్పించిన నయనతార ఈ పాంచాలి పాత్రకి కూడా న్యాయం చేస్తుందని చిత్ర యూనిట్ భావిస్తోందట. ఇకపోతే ఈ మహాభారత కోసం బీష్ముడిగా అంబరీష్, దుర్యోధనుడిగా దర్శన్, కర్ణుడిగా రవిచంద్రన్ లను ఎంపిక చేసినట్లు చెబుతున్నారు. అయితే ఒకమాదిరి బడ్జెట్ సినిమాలకే నయనతార షాకింగ్ రెమ్యునరేష్ రాబడుతుంది... మరి 1000 కోట్ల భారీ బడ్జెట్ చిత్రానికి ఇంకెంత డిమాండ్ చేస్తుందో అంటున్నారు.