Advertisementt

కీర్తి, శర్వాలకు బంపర్‌ ఆఫర్‌...!

Fri 07th Jul 2017 03:03 PM
sharwanand,keerthy suresh,raghavendra rao,director prakash kovelamudi,arka media  కీర్తి, శర్వాలకు బంపర్‌ ఆఫర్‌...!
Keerthy Suresh and Sharwanand Combo Soon కీర్తి, శర్వాలకు బంపర్‌ ఆఫర్‌...!
Advertisement
Ads by CJ

ఇటీవలే 'బాహుబలి'ని నిర్మించిన ఆర్కా మీడియా అధినేతలు తాజాగా ఓ చిన్న చిత్రానికి శ్రీకారం చుడుతున్నారు. కె.రాఘవేంద్రరావు సమర్పణలో రూపొందే ఈ చిత్రంలో మెయిన్‌ లీడ్‌ రోల్‌ని కీర్తి సురేష్‌ చేయనుందట. ఇక ఆమె పక్కన యువ హీరో శర్వానంద్‌ని ఫిక్స్‌ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తెలుగులో ఉన్న అతి సాంప్రదాయమైన టాలెంట్‌ ఉన్న నటి కీర్తిసురేషే. భాను ప్రియ, సౌందర్యల తర్వాత ఎక్స్‌పోజింగ్‌ కంటే నటనపైనే ఈ అమ్మడు ఫోకస్‌ పెట్టింది. 

ఎంత పెద్ద స్టార్‌ సినిమాలో అవకాశం వచ్చినా ఎక్స్‌పోజింగ్‌కి నో చెబుతోంది. ఇక ఈమె తెలుగులో 'నేను.. శైలజ'తో ఎంట్రీ ఇచ్చి, 'నేను..లోకల్‌'తో బాక్సాఫీస్‌ కొల్లగొట్టడంతో తన వంతు పాత్ర పోషించింది. విజయ్‌తో సహా ఎవరితో నటించినా పద్దతిగా నటిస్తోంది. తాజాగా హీరోయిన్లను గ్లామర్‌గా చూపిస్తూనే, ఏమాత్రం అసభ్యంగా చూపకుండా, ఆయా హీరోయిన్లలోని నటనను మాత్రమే పరిగణనలోకి తీసుకునే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో పవన్‌ కళ్యాన్‌ హీరోగా నటిస్తున్న చిత్రంలో నటిస్తోంది. 

మరో వైపు నాటి మహానటి సావిత్రి బయోపిక్‌లో నటనను అద్భుతంగా ప్రదర్శించాల్సిన అవసరం ఉన్న చిత్రం 'మహానటి'లో ఆమె తనదైన నటనా ప్రతిభను చూపించడానికి రెడీ అవుతోంది. ఇక ఆర్కా మీడియాలో కీర్తి, శర్వాలు నటించే చిత్రానికి కె.రాఘవేంద్రరావు కుమారుడు ప్రకాష్‌ కోవెలమూడి దర్శకత్వం వహించనున్నాడు. కీర్తికి తెలుగులో పాటు తమిళ, మలయాళంలో కూడా గుర్తింపు ఉండటంతో ఈ చిత్రం దక్షిణాదిలోని అన్ని చిత్రాలలో విడుదలయ్యే అవకాశాలున్నాయి. 

Keerthy Suresh and Sharwanand Combo Soon:

Arka Media Heads recently planed a smal movie. In this movie main role Keerthy Suresh and Sharwanand is hero. Director by Raghavendra Rao son Prakash Kovelamudi.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ