అసలు మతిలేని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎన్టీఆర్ బయోపిక్ తెరకెక్కించడమేమిటి అని ఒక పక్క ఎన్టీఆర్ అభిమానులు తెగ సతమతమవుతున్నారు. ఎన్టీఆర్ లాంటి మహోన్నత వ్యక్తి జీవితంలో జరిగిన యదార్ధ ఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ బయోపిక్ లో బాలకృష్ణ, ఎన్టీఆర్ కేరెక్టర్ చేస్తానని ఎప్పుడో ప్రకటించాడు. కానీ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ బయోపిక్ మీద మామూలు రచ్చ జరగడగం లేదు. ఎపుడూ కాంట్రవర్సీలును జేబులో పెట్టుకుని తిరిగే రామ్ గోపాల్ వర్మ గొప్ప వ్యక్తి అయిన ఎన్టీఆర్ బయో పిక్ ని తెరకెక్కించే అర్హత ఉందా అంటూ విరుచుకుపడుతున్నారు.
అసలు రెండు రోజులుగా ఈ రచ్చ పెద్ద ఎత్తున జరుగుతున్నప్పటికీ ఎన్టీఆర్ బయోపిక్ ని తెరకెక్కిస్తానని చెప్పిన బాలకృష్ణ మాత్రం ఎక్కడా స్పందించకుండా మౌనం పాటిస్తున్నాడు. ఇక ఇదంతా ఒక ఎత్తైతే బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తన తాతగారి బయోపిక్ ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి పరిచయమవుతున్నాడనే గాసిప్ ఒకటి బయలుదేరింది. అయితే మోక్షజ్ఞ ని వెండితెరకి తాతగారి బయోపిక్ ద్వారానే పరిచయం చెయ్యాలనే ప్లాన్ చేస్తున్నది కూడా రామ్ గోపాల్ వర్మే అంటూ గాసిప్ ఒకటి సోషల్ మీడియాలో ప్రచారం మొదలయింది .
అయితే మోక్షజ్ఞ ఎన్టీఆర్ బయోపిక్ లో ఎన్టీఆర్ కుర్రాడిగా ఉన్నప్పుడు ఆయన స్వగ్రామం నిమ్మకూరులో ఉన్నప్పటి పాత్రను మోక్షజ్ఞ చేస్తే బాగుంటుందనేది రామ్ గోపాల్ వర్మ ఐడియా అంటూ సోషల్ మీడియాలో తెగ సర్క్యులేట్ అవుతుంది. అయితే మోక్షజ్ఞ అలా ఎన్టీఆర్ కుర్రాడి పాత్ర చెయ్యడం అనేది వినడానికి బావుంది గాని దానిని రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించడం అనేది బాగోలేదని అంటున్నారు నందమూరి ఫ్యాన్స్. మరి ఇందులో నిజమెంత ఉందొ అనేది తెలియాలంటే బాలకృష్ణ ఖచ్చితంగా స్పందించి తీరాల్సిందే అంటున్నారు నందమూరి అభిమానులు.