హరీష్ శంకర్ డైరెక్ట్ చేసిన 'డీజే దువ్వాడ జగన్నాథం' విడుదలై టాక్ బాగోనప్పటికీ కోట్లు కొల్లగొడుతూ సంచలనాలు నమోదు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే సినిమా విడుదలకు ముందే బ్రాహ్మణ సంఘాల నుండి తీవ్ర వ్యతిరేకతను చవి చూసింది ఈ సినిమా. ఇక విడుదలయ్యాక క్రిటిక్స్ తో కూడా 'డీజే' చిత్రం విమర్శలపాలైంది. సినిమా ఏమాత్రం బాగోలేదని క్రిటిక్స్ 'డీజే' కి పూర్ రేటింగ్స్ ఇచ్చారు. మొదటిరోజే సినిమా పని అయిపోయిందంటూ సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే అల్లు అర్జున్, హరీష్ శంకర్ ఈ రేటింగ్స్ పై బహిరంగంగానే స్పందించారు.
అయినా సినిమా పోయినప్పటికీ కలెక్షన్స్ మాత్రం అదిరిపోయే రేంజ్లో డిజేకి వచ్చాయంటూ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది చిత్రం యూనిట్. సినిమా విడుదలై వారం కాకముందే డీజే చిత్రం 100 కోట్ల గ్రాస్ సాధించిందని ఊదరగొట్టారు. అయితే ఇదంతా ఫేక్ కలెక్షన్స్ అంటూ మీడియాలోనే ప్రచారం జరిగింది. ఇక యుఎస్ ట్రిప్ లో ఉన్న డీజే టీమ్ అక్కడ కూడా మీడియా వారిని విమర్శిస్తూనే వున్నారు. అయితే ఇప్పుడు తాజాగా హరీష్ శంకర్ ఒక ట్వీట్ చేసాడు.
‘డీజే’ సినిమా నైజాం ఏరియాలో 20 కోట్ల కలెక్షన్స్‌ను రాబట్టిందని అఫీషియల్ గా అనౌన్స్ చేస్తూ డైరెక్టర్ హరీష్ ఒక ట్వీట్ చేశాడు. సినిమా విజయాన్ని ఎంజాయ్ చేయాలనుకుంటున్నా.. కానీ, తప్పడం లేదు.. యుద్ధం శరణం గచ్ఛామి. అంటూనే ఎవరైనా మాకొచ్చిన కలెక్షన్లు తప్పు అని రుజువు చెయ్యగలిగితే నేను ఇక సినిమాలు తీయడం మానేస్తా. ఒకవేళ నిరూపించలేకపోతే మీ వెబ్‌సైట్లు మూసెయ్యగలరా... ‘గబ్బర్‌సింగ్’ తర్వాత ‘డీజే’ నైజాంలో ఇలా 20 కోట్లు వసూలు చేయడం నాకు ఆనందంగా, గర్వంగా ఉంది అంటూనే... 'క్షమించండి.. ప్రస్తుతం సినిమా విజయాన్ని ఏంజాయ్ చేయాలనుకుంటున్నా. ఇలా ట్వీట్ చేయాలనుకోలేదు. కానీ, తప్పడం లేదు. యుద్ధం శరణం గచ్ఛామి’ అని ఘాటుగా ట్వీట్ చేశాడు హరీష్ శంకర్.