Advertisementt

అర్జున్‌ విలన్.. కాదని తెలిసిపోయింది!

Thu 06th Jul 2017 04:29 PM
arjun,lie,intelligence,nithiin movie  అర్జున్‌ విలన్.. కాదని తెలిసిపోయింది!
Arjun Look Revealed in LIE అర్జున్‌ విలన్.. కాదని తెలిసిపోయింది!
Advertisement
Ads by CJ

ఆగష్టు11న విడుదల కానున్న నితిన్‌, యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ల కాంబినేషన్‌లో రూపొందుతున్న 'లై' (అబద్దం) మంచి ఆసక్తిని క్రియేట్‌ చేస్తోంది. 'లై'కి స్పెల్లింగ్‌ 'ఎల్‌ ఐ ఈ'. ఇక ఎల్‌ అంటే లవ్‌, ఐ అంటే ఇంటిలిజన్స్, ఈ అంటే ఎనిమి అని అర్దం. కాగా ఈ చిత్రం షూటింగ్‌ ఎక్కువ భాగం అమెరికాలో జరిగింది. ఇందులో నితిన్‌ ఓ హైదరాబాద్‌ పాతబస్తీకి చెందిన యువకుడి గెటప్‌లో గడ్డం పెంచి వెరైటీగా ఉన్నాడు. ఇక ఇందులో యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ విలన్‌ పాత్రలో నటించనున్నాడని వార్తలు వచ్చాయి. కానీ ఈ రకమైన వార్తలను అర్జున్‌ ఎప్పటికప్పుడు ఖండిస్తూనే ఉన్నాడు. తాను ఇంకా విలన్‌గా మారే పరిస్థితి రాలేదని పలుసార్లు చెప్పాడు. ఇక ఈ చిత్రంలోని మొదటి లుక్‌ 'లవ్‌'కి సంబంధించిన మేఘాఆకాష్‌ పిక్‌ విడుదలై మంచి స్పందన రాబడుతోంది. 

'ఈ' ఫర్‌ ఎనిమి స్థానంలో అర్జున్‌ లుక్‌ ఉంటుందని భావిస్తే, 'ఐ' ఫర్‌ ఇంటెలిజెన్స్‌ అనేదానికి గుర్తుగా స్విమ్మింగ్‌ పూల్‌లో ఈతకొడుతూ సేదతీరుతున్న ఫొటోను వెనక నుంచి వీపు కనిపించేలా తీసి విడుదల చేశారు. అర్జున్‌ ఫేస్‌ తో లుక్‌ని ఈరోజు రివీల్‌ చేయనున్నారు. దీంతో యాక్షన్‌కింగ్‌ అర్జున్‌ ఇందులో విలన్‌ కాదని తేలిపోయింది. ఇక 'ఈ' ఫర్‌ ఎనిమిలో ఎవరితో సర్‌ప్రైజ్‌ ఇస్తారో చూడాలి...! కాగా ఈ చిత్రం ఇంటర్నేషనల్‌ నుంచి హైదరాబాద్‌ పాతబస్తీలో కూడా ఆనవాళ్లు కనిపిస్తున్న ఇస్లామిక్‌ టెర్రరిజానికి, ఓ సిబిఐ ఆఫీసర్‌కి, ఆయన కూతురికి మద్య జరిగే సంఘటలను, వాస్తవ ఘటనల నేపధ్యంలో సాగుతుందని అంటున్నారు. 

Arjun Look Revealed in LIE:

Arjun Place Revealed Intelligence in LIE Title

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ