నిన్నమొన్నటిదాకా తెలుగు బిగ్‌బాస్‌లో ఎన్టీఆర్ హోస్ట్‌గా చేస్తున్నా అందులో నటించేందుకు సెలబ్రిటీలు ఒప్పుకుంటారా? లేదా? అన్న చర్చసాగింది. ఈనెల 16నుంచి ప్రసారం కానున్న ఈ సీజన్ షోలో పాల్గొనే వారి పేర్లు కొన్ని వినిపిస్తున్నాయి. రచయిత, దర్శకుడు, నటుడు,సపోర్టింగ్, అండ్ కామెడీ నటుడు పోసాని కృష్ణ మురళి ముందుగా పేర్కొన్న ప్రకారం మొదటి సీజన్‌లో పాల్గొననున్నాడు.
తనదైన మాటలతో, కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడే పోసాని ఏకంగా బిగ్‌బాస్‌లో నటిస్తున్నాడంటే ఇక సంచలనాలకు కొదువే ఉండదు. అదే సమయంలో ఈటీవీలో వస్తున్న'ఢీ' షోలో జడ్జిగా పనిచేస్తున్న నాటి దక్షిణాది అందాల తార, తేజ పరిచయం 'జయం' ద్వారా పరిచయం చేసిన సదా కూడా ఈ సెలబ్రిటీల లిస్ట్‌లో ఉంది. చిరంజీవి,నాగార్జున, వెంకటేష్‌ల నుంచి రాజేంద్ర ప్రసాద్ వరకు అందరితోనూ నటించి, యమదొంగ చిత్రంలో ఎన్టీఆర్ సరసన స్టెప్పులేసిన రంభ, తన నటనతో దక్షిణాదిలోని అన్ని భాషల్లో నటిగా పేరుతెచ్చుకుని, ముఖ్యంగా 'శ్రీరామదాసు, పాండు రంగడు'వంటి పలు చిత్రాలలో కనిపించిన హోమ్లీ హీరోయిన్ స్నేహ, సినిమా నటిగా, యాంకరుగా, టీవీ షోలలో పనిచేస్తూ పేరు తెచ్చుకున్న మంచు మోహన్‌బాబు కూతురు మంచు లక్ష్మి కూడా ఈ కార్యక్రమంలో కూడా హోస్ట్‌గా నటించనుందని తెలియడంతో ఈ కార్యక్రమంపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. వీరిలో పోసాని, మంచు లక్ష్మిల పేర్లు ముందు నుంచి వినిపిస్తున్నా వారు వాటిని ఖండించారు. కానీ ఇప్పుడు వారే నటిస్తున్నారని దాదాపుగా కన్‌ఫర్మ్ అయింది.