రవితేజ ఈ మధ్యన తన తమ్ముడు వలన వరుస వివాదాల్లో కూరుకుపోతున్నాడు. తమ్ముడు భరత్ రోడ్డు ప్రమాదంలో చనిపోతే కనీసం ఆఖరి చూపుకుకూడా వెళ్లకుండా.... అంత్యక్రియలు కూడా నిర్వహంచలేదనే అపవాదు మూటగట్టుకున్నాడు. అలాగే తమ్ముడు మరణించిన మరుసటి రోజే షూటింగ్ కి హాజరై జనాలకు షాక్ ఇచ్చాడు. అయితే మీడియాలో రవితేజ చేసిన పనిని తప్పుబడుతూ అనేక కథనాలొచ్చాయి. సోషల్ మీడియాలో అయితే రవితేజ అలా చెయ్యకుండా ఉండాల్సిందంటూ ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు.
అయితే తన తమ్ముడిని అలా ఛిద్రమైన రూపంతో చూడలేకే తమ కుటుంబ సభ్యులెవరూ వెళ్లలేదని ...కనీసం టివి లో భరత్ ని అలా చూడలేక టీవీ కూడా చూడలేదని క్లారిటీ ఇచ్చాడు. తమ్ముడి మరణాంతర పరిణామాలపై మీడియాలో స్పష్టంగా వివరణ ఇచ్చాడు రవితేజ. ఇక రవితేజ తాజాగా తమ్ముడు 11 వ రోజు పెద్ద ఖర్మ కి భరత్ ఇంటికి హాజరయ్యాడు. భరత్ ఒంటరిగా నివసించిన ఇంటిలోనే అతనికి చెయ్యాల్సిన ఖర్మని నిర్వహించారు. అయితే అక్కడ తమ్ముడి ఫోటో కి దండేసి దండం పెట్టుకుని మీడియాతో మాట్లాడాడు రవితేజ.
ఆక్సిడెంట్ లో ఛిద్రమైన తమ్ముడిని అలా చూడలేకే తాము భారత్ అంత్యక్రియలకు రాలేదని ఇంతకుముందే చెప్పాను. అయినా మీడియా వారు నా గురించి తప్పుగా అర్ధం చేసుకుని ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు రాసుకున్నారు. తన తల్లితండ్రుల ఆరోగ్య పరిస్థితి రీత్యా తాను ఇంతటి కఠిన నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశాడు. ఇక షూటింగ్ కి ఎందుకు హాజరవాల్సి వచ్చిందో కూడా క్లారిటీ ఇచ్చాడు. అయితే మీడియాలో కొంతమంది మాత్రమే మీ గురించి అలా రాశారు. అంతమాత్రాన మిగతావారిని అలా అనడం కరెక్ట్ కాదని రవితేజని మీడియా వారు అడగగా.. వాటికి సమధానం చెప్పకుండా రవితేజ మీడియాని అవాయిడ్ చేశాడు. ఇక రవితేజ పర్సనల్ సిబ్బంది కూడా మీడియా వాళ్లతో కాస్త కఠినంగానే వ్యవహరించడం వివాదాస్పదమైంది. ఇక రవితేజ తన తమ్ముడి మరణం వల్ల ఇంకా ఇంకా చెడ్డపేరు తెచ్చుకుంటూనే వున్నాడు.