ఒకే ఒక్క సినిమా ఆమె జీవితాన్ని మార్చేసింది. ట్రెడిషనల్ అమ్మాయిగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన పూజ హెగ్డేకి ఆ సినిమాలు పెద్దగా పేరు తీసుకురాలేదు సరికదా ఆఫర్స్ కూడా లేకుండా చేశాయి. కానీ ఏదో అదృష్టం బాగుండి మెగా హీరో అల్లు అర్జున్ పక్కన ఛాన్స్ కొట్టేసి డీజే చిత్రంలో గ్లామర్ షో చేసింది. స్విమ్మింగ్ ఫూల్ లో స్విమ్ సూట్ బికినీ తో చేసిన గ్లామర్ షో కి పూజ హెగ్డే కి విపరీతమైన పేరొచ్చేసింది. నటనలో పెద్దగా మెళుకువలు తెలియకపోయినా.. అందంతో నెట్టుకొస్తుందనే అంచనాకి వచ్చేసారు టాలీవుడ్ దర్శక నిర్మాతలు.
ఇక డీజే తర్వాత మహేష్ కొత్త సినిమా కోసం పూజ ని ఎంపిక చేస్తున్నట్లు వార్తలొచ్చినప్పటికీ ఇప్పట్లో అది అయ్యే పనికాదంటున్నారు. ఇకపోతే బెల్లంకొండ శ్రీనివాస్ కి జోడిగా చేస్తున్న పూజ హెగ్డే ఆ సినిమా కోసం కోటిన్నర అందుకుంటుందన్న నేపథ్యంలో ఇప్పుడు మరో న్యూస్ పూజ పై టాలీవుడ్ ఫిలింసర్కిల్స్ లో వినబడుతుంది. డీజే చిత్ర విజయంతో పూజకి కి మంచి క్రేజ్ వచ్చేసింది. ఈ క్రేజ్ తోనే ఒక షాపింగ్ మాల్ ఓపెనింగ్ కోసం యజమానులు పూజా హెగ్డేను కలిశారట. మరి షాప్ ఓపెనింగ్ కి వచ్చే టాప్ హీరోయిన్స్ ఎవరైనా ఓపెనింగ్ చేసిందనుకుగాను కాస్ట్లీ గిఫ్ట్స్ గాని... లేకుంటే రెండు నుండి మూడు లక్షల వరకు చార్జ్ చేస్తారు
కానీ ఆ భారీ షాప్ ఓపెనింగ్ కోసం పూజ హెగ్డే ఏకంగా 10 లక్షలు డిమాండ్ చేసినట్లు వార్తలొస్తున్నాయి. కేవలం కొన్ని నిమిషాల కోసమే పూజ ఇంత డిమాండ్ చెయ్యడం చూసిన వారికి నోట మాట పడిపోయిందట. మరి పది లక్షలు పెడితే ఒక్క పూజ హెగ్డే ఏం ఖర్మ ఇద్దరు ముగ్గరు టాప్ హీరోయిన్స్ షాప్ ఓపెనింగ్ వస్తారనుకుని ఆ షాప్ యాజమాన్యం అక్కడ నుండి మెల్లగా జారుకుందట..