Advertisementt

కళ్యాణ్‌రామ్‌, ఎన్టీఆర్...ద్రిష్టి తగులుతుందేమో!

Wed 05th Jul 2017 08:21 PM
kalyan ram,jr ntr,birthday wishes,annaaa,nanna,jr ntr twitter  కళ్యాణ్‌రామ్‌, ఎన్టీఆర్...ద్రిష్టి తగులుతుందేమో!
Jr NTR Bday Wishes to His Brother Kalyan Ram కళ్యాణ్‌రామ్‌, ఎన్టీఆర్...ద్రిష్టి తగులుతుందేమో!
Advertisement
Ads by CJ

స్వర్గీయ ఎన్టీఆర్‌కి తన మనవళ్లైన జూనియర్‌ ఎన్టీఆర్‌, నందమూరి కళ్యాణ్‌రామ్‌లంటే భలే ఇష్టం. ఇద్దరికీ పేర్లు పెట్టింది కూడా ఆయనే. జూనియర్‌ని నటునిగా చేయాలని, కళ్యాణ్‌రామ్‌ని ఇంజనీర్‌ని చేయాలని ఆయన కోరిక. అనుకున్నట్లే ఎన్టీఆర్‌ బాల్యం నుంచి నటునిగా క్రేజ్‌ తెచ్చుకుంటూ ఉంటే కళ్యాణ్‌రామ్‌ తమ తాత కోరిక మేరకు కోయంబత్తూరులో ఇంజనీరింగ్‌ చేశాడు. చివరకు ఆయన కూడా నటునిగా, నిర్మాతగా మారాడు. తొలిసారి తన తమ్ముడు ఎన్టీఆర్‌తో తన తాత పేరు మీద స్థాపించిన ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ బేనర్‌లో 'జై లవకుశ' నిర్మిస్తున్నాడు. వీరికి వీరి తండ్రి హరికృష్ణ అన్నా కూడా ఎంతో ప్రేమ. 

ఇక కెరీర్‌ మొదట్లో వీరిమద్య సరైన సంబంధాలు లేవు. కానీ ఇప్పుడు వీరిద్దరూ బాగా క్లోజ్‌ అయ్యారు. కాగా జూనియర్‌ ఎన్టీఆర్‌ బర్త్‌డే సందర్భంగా తన వీపు మీద ఎక్కిన ఎన్టీఆర్‌ని 'విష్‌ యూ హ్యాపీ బర్త్‌డే నాన్నా...' అని కళ్యాణ్‌రామ్‌ ఎన్టీఆర్‌ని తన నాన్నతో పోల్చాడు. ఇక ఈ రోజు(జులై 5) కళ్యాణ్‌రామ్‌ పుట్టిన రోజు. ఈ సందర్భంగా వెనుక నుంచి జూనియర్‌ తన అన్నయ్య భుజం మీద ఎంతో ప్రేమతో వేసిన చేతి ఫొటోను ట్వీట్‌ చేస్తూ..హ్యాపీ బర్త్‌డే అన్నా.. అని ఆప్యాయంగా సంబోధించాడు. మొత్తానికి అన్నయ్య తన తమ్ముడిని ఆప్యాయంగా నాన్నా అని పిలిస్తే, జూనియర్‌ తన అన్నయ్యను పేరుతో కాకుండా అన్నయ్యా అని ఉద్వేగంగా పేర్కొనడం వారి మద్య ఏర్పడిన బంధానికి గుర్తుగా నిలుస్తుందనే చెప్పాలి. 

Jr NTR Bday Wishes to His Brother Kalyan Ram:

Jr NTR Birthday Greeting to Kalyan Ram in Twitter with Photo

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ