బన్నీ తాజాగా రివ్యూరైటర్లపై మరో సారి విరుచుకుపడ్డాడు. ఇప్పటికే బన్నీతో పాటు నిర్మాత దిల్‌రాజు, దర్శకుడు హరీష్‌శంకర్‌లు కూడా సక్సెస్‌మీట్‌ని కాస్తా రివ్యూ రైటర్స్‌లకు క్లాస్ తీసుకునే విధంగా నిర్వహించారు. ఇక తాజాగా బన్నీ మాట్లాడుతూ, సినిమాకి రివ్యూలు రాసేవారు కమర్షియల్ చిత్రాలను గౌరవించడం నేర్చుకోవాలన్నాడు. ఇది నిజంగా ఒప్పుకోవాల్సిన విషయం. అయితే ఆయన దృష్టిలో కమర్షియల్ చిత్రం అంటే ఏమిటోమాత్రం అర్ధం కావడం లేదు.
ప్రపంచంలోని మిగతా సినిమాలలో కంటే మన సినిమాలే మల్టీజోనర్‌ని కలగి ఉంటాయని, 'టైటానిక్'సైతం కేవలం లవ్, డ్రామా అనే రెండు జోనర్లలోనే వచ్చిందని, కానీ మన సినిమాలు డ్యాన్స్‌లు, ఫైట్స్, కామెడీ ఇలా అన్ని జోనర్స్‌ని టచ్ చేస్తాయి కాబట్టి వాటిని మిగతా దేశాల వారు కూడా తనతో గొప్పగా చెబుతారని, అన్ని మిళితమై ఉండటం వల్లే 'బాహుబలి' అంత పెద్ద విజయం సాధించిందని తేల్చిచెప్పాడు.
ఇక బన్నీ వాదన సరే అని ఒప్పుకున్నా 'శంకరాభరణం, స్వాతిముత్యం, అంతిమతీర్పు, బొమ్మరిల్లు'లతో సహా ఎన్నో చిత్రాలు తెలుగులో మరిచిపోలేని హిట్స్‌గా నిలిచియి. అవి పండితులనే కాదు.. పామరులను కూడా మెప్పించాయి. 'శంకరాభరణం'సినిమాని తమిళ్‌లోకి డబ్ చేసినా పాటలను మాత్రం తెలుగులోనే ఉంచారు. వాస్తవానికి అండులోని పాటలు చదువురాని సామాన్యులకు అర్దంకావు. కానీ ఆరోజుల్లోనే 'శంకరాభరణం' ఎన్ని రోజులు ఆడిందో అన్నిరోజులు ప్రతి రోజు ఏదో ఒక షో ఆచిత్రాన్ని చూసినవారు ఉన్నారు.
ఇక రివ్యూ రైటర్స్‌కి ఏం అర్హత ఉందని స్టార్స్ ఇస్తున్నారు? అని బన్నీ ప్రశ్నించాడు. మరి బన్నీకి అల్లుఅరవింద్ కుమారుడుగా, మెగా ఫ్యామిలీ తప్పితే ఆయన తన మొదటి చిత్రం 'గంగోత్రి' చేసినప్పుడు ఆయనకు నటునికి కావాల్సినే ఏ అర్హతలు ఉన్నాయో ఆయనే సెలవివ్వాలి. నాడు 'గంగోత్రి'లో చూసి ఇతనేం హీరో అని దిల్‌రాజు తాను కూడా భావించినట్లు ఆమద్య మీడియాతోనే ఓపెన్‌గా అన్నాడు. ఇక చిరు అయితే కొందరు తనకు ఫోన్ చేసి మా అబ్బాయికి ఏమీ రాక చెడిపోతున్నారని, వారిని హీరోలను చేద్దామని అనుకుంటున్నట్లు పలువురు అనేవారని, అంటే హీరో అంటే మిగతా దేనికి పనికిరాని వాడా? అంటూ ఓవేడుకలో చలోక్తి విసిరాడు.
ఇక నిర్మాతగా దిల్‌రాజు, దర్శకునిగా హరీష్ శంకర్‌లకి కూడా ఏమి అనుభం ఉందని సినిమా రంగానికి వచ్చారు? వారేమైనా శంకర్‌లా, మణిరత్నాలా? లేక పూర్ణోధయ మూవీస్ ఏడిద నాగేశ్వరారావు, కాట్రగడ్డ మురారిలాగా కళాత్మక చిత్రాలు చేయడానికి సినీ ఫీల్డ్‌కి వచ్చారా? శంకర్ , దాసరి వంటి వారు కేవలం వినోదాన్నే కాదు.. అన్ని చూపిస్తూనే సమాజానికి ఏదైనా మంచి చూపాలని తాపత్రయపడేవారు. మరి వీరు అలాకాదే. అల్లు శిరీష్ ఇప్పటికీ హీరోగా నటిండానికి అతనికి ఉన్న అర్హత ఏమిటి? కాబట్టి అన్ని జోనర్స్‌ని చూపిస్తున్నామని సొంత డబ్బా కొట్టుకుంటే చాలదు. వారి చిత్రానికి డబ్బులైతే వచ్చాయి కానీ ఓ ప్రేక్షకుడు డిజె చూసి బాగుంది అనలేదు.
అన్ని రసాలను కొంచెం కొంచెం చూపించి, ఇది కమర్షియల్ సినిమా అంటే సరిపోదు. ఇవ్వన్నీ కిచిడీ చిత్రాలు మాత్రమే. ఇక తెలుగువారందరిది ఇండియాలోనైనా అమెరికాలోనైనా ఒకే విధంగా అభిరుచి ఉంటుందని బన్నీ తేల్చాడు. మరి 'డిజె' రెండు తెలుగు రాష్ట్రాలలో బాగా ఆడటానికి, ఓవర్‌సీస్‌లో బజ్జోవడానికి కారణంఏమిటి? తనను ఆర్య వంటి చిత్రాలల పొగిడినప్పుడు ఆనందంగా ఉండి, ఒక చిత్రం బాగాలేదంటే మొత్తం రివ్యూ రైటర్లందరినీ తప్పుపట్టడం సంస్కారం కాదు.