నవ్విస్తూనే.. ఏడిపిస్తూ... ఏడుపులో కూడా ఎంటర్‌టైన్‌మెంట్ పండించే చిత్రాలు ఒకప్పుడు బాగా వచ్చేవి. కానీ ఈమద్య అవి తక్కువయ్యాయి. అప్పుడెప్పుడో రాజేంద్రప్రసాద్ చేసిన 'ఆ..నలుగురు. ఇట్లు మీ శ్రేయోభిలాషి' వంటి చిత్రాలు ఏడిపిస్తూ నవ్వించి, సమాజానికి మంచి సందేశం ఇచ్చాయి. కాగా తనదైన ప్రతి చిత్రాన్ని సమ్‌థింగ్ స్పెషల్‌గా ఉండాలని కోరుకునే నేచురల్ స్టార్ నాని శుక్రవారం రానున్న 'నిన్నుకోరి'లో అదే చేయనున్నాడట.
సామాన్యంగా తన సినిమా విడుదలకు ముందే కాన్ఫిడెన్స్ వ్యక్తం చేస్తాడే గానీ నాని ఎక్కువగా మాట్లాడడు. తన చేతల్లోనే చూపిస్తాడు. కానీ ఈ చిత్రం గురించి మాత్రం నాకు ఎంతో ఫీల్‌నిచ్చిన చిత్రం, బాగా కనెక్ట్ అయ్యాను అన్నాడు. ఇక దీనికి షార్ట్‌ఫిల్మ్ మేకర్‌గా పేరుతెచ్చుకున్న శివ నిర్వాణ తొలిసారి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈచిత్రంలో నాని 'భలే భలే మగాడివోయ్'తరహాలో ఒకే టేక్‌లోచేసే సీన్స్ చాలా ఉన్నాయట, మరోవైపు వైజాగ్‌లో ఓ సారి, అమెరికాలో ఓసారి, క్లైమాక్స్‌లో కూడా మరోసారి ప్రేక్షకులను బాగా ఇన్‌వాల్వ్ అయి అందరికీ కంటిలో నీళ్లొచ్చేలా చెమ్మగిల్లేట్టు చేస్తున్నాడట.
అయిన జనాలను ఏడిపించడం కోసం వైజగ్, అమెరికాకు వెళ్లాలా ఏంటి? నాని ఎక్కడైనా నవ్వించి ఏడిపిస్తాడు. అందుకే ఆయన నేచురల్‌స్టార్ అయ్యాడు. ఇక ఈ చిత్రం సల్మాన్ ఖాన్ నటించిన 'హమ్ దిల్ దే చుకే సనమ్' కు కాపీ అంటున్నారు. అయినా సోషల్ మీడియాలో ఫస్ట్‌లుక్‌లు, టీజర్లు,ట్రైలర్స్ జోరు పెరగడంతో అందులోని ఓ సీన్‌ని, డైలాగ్‌ని, ఓ గెటప్‌ని చూసి పెద్ద పెద్ద స్టార్స్ చిత్రాల నుంచి ఇలా రావడం కామన్ అయిపోయింది అయినా నాని టేస్ట్ తెలిసిన వారు మాత్రం ఈ వార్తలను కొట్టిపడేస్తున్నారు. ఏదైనా శుక్రవారానికి తేలిపోతుంది కదా...!