టాలీవుడ్ లో ఇప్పటివరకు నటించింది రెండు సినిమాలే అయినా కూడా ఇప్పుడు స్టార్ హీరోల పక్కన హీరోయిన్ గా ఛాన్స్ లు కొట్టేస్తూ అదృష్టం అంటే నాదే అని నిరూపిస్తుంది ఈ భామ. 'మజ్ను' సినిమాలో నానికి జంటగా నటించిన అను ఇమ్మానుయేల్ ఆ సినిమాతో డీసెంట్ హిట్ అందుకుంది. అలాగే రాజ్ తరుణ్ తో 'కిట్టు ఉన్నాడు జాగ్రత్త'లో కూడా నటించిన ఈ భామ తన మూడో ప్రాజెక్ట్ తోనే పవన్ కళ్యాణ్ వంటి హీరో పక్కన ఛాన్స్ కొట్టేసి ఆదరికి షాక్ ఇచ్చింది.
అయితే పవన్ పక్కన అను ఇమ్మానుయేల్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్న కీర్తి సురేష్ కూడా టాలీవుడ్ లో నటించిన రెండు సినిమాలతోనే మంచి కీర్తిని సంపాదించడమే కాదు మూడో సినిమాకే పవన్ పక్కన ఛాన్స్ కొట్టేసి ఔరా అనిపించింది. ఇక ఇప్పుడు అను ఇమ్మానుయేల్ కి మరో మెగా హీరో ఛాన్స్ ఇచ్చాడనే వార్త ప్రచారంలో వుంది. అల్లు అర్జున్, వక్కంతం వంశీ కాంబినేషన్ లో రాబోతున్న 'నా పేరు సూర్య...' చిత్రంలో హీరోయిన్ గా అను ఇమ్మానుయేల్ తో చర్చలు జరుపుతున్నారని టాక్ వినబడుతుంది.
ఇక అను ఇమ్మానుయేల్ కి మరో బంపర్ ఆఫర్ తగిలిందంటున్నారు. అదేమిటంటే ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కే మూవీ లో కూడా అనునే హీరోయిన్ గా అనుకుంటున్నారట. పవన్ తో త్రివిక్రమ్ చేసే సినిమాలో అను ఇమ్మానుయేల్ బాగా నటిస్తుండడంతో ఎన్టీఆర్ సినిమాకి కూడా అను నే.. త్రివిక్రమ్ ఫిక్స్ అయ్యాడని అంటున్నారు. మరి త్రివిక్రమ్ ఛాన్స్ కి ఎన్టీఆర్ ఏమంటాడో గాని ప్రస్తుతం మాత్రం అను పంట పండినట్లే అంటున్నారు. మరి కెరీర్ ఆరంభంలోనే ముగ్గురు స్టార్ హీరోల పక్కన ఛాన్స్ దొరకడమంటే అదృష్టం ఏ రేంజ్ లో ఉండాలి అంటున్నారు.