'బాహుబలి'లో భళ్లాలదేవగా ప్రభాస్‌కి పోటాపోటీగా నటించిన రానా ఆ వెంటనే 'ఘాజీ'తో బాలీవుడ్‌పై దండెత్తి తాననుకున్నది సాధించాడు. ఇక తెలుగులో మాత్రం సోలో పవర్‌ఫుల్ హిట్ ఇస్తుందని 'నేనే రాజు..నేనే మంత్రి'పై నమ్మకంగా ఉన్నాడు. తేజ కసిమీద తీస్తుండటం, రానా మంచి ఫామ్‌లో ఉండటం, కాజల్‌వంటి టాప్ హీరోయిన్ నటిస్తుండటంతో పాటు చిత్రాలను ఈమద్య ఆచి తూచి నిర్మిస్తున్న సురేష్‌బాబు ఎంతో నమ్మకంతో తేజ చేతిలో సినిమాని, తన కొడుకిని పెట్టాడంటే విషయం ఏదో ఉండే ఉంటుంది.
ఇక ఈ చిత్రం టైటిల్ నుంచి టైటిల్ లోగో, టీజర్, ట్రైలర్స్ కేకపుట్టిస్తున్నాయి. లక్ష్మీభూపాలా రాసిన సంభాషణలకు, పొలిటికల్ సెటైర్‌తో కూడిన పవర్‌ఫుల్ డైలాగ్స్ క్యూరియాసిటీని కలిగిస్తున్నాయి. కేవలం టీజర్ , ట్రైలర్‌లోని డైలాగ్‌లే ఇలా ఉంటే.. ఇక సినిమాలో ఎన్ని పవర్‌ఫుల్ డైలాగ్స్ ఉంటాయో అని ఎంతో ఉత్సుకత కలిగిస్తోంది. ఇటీవలికాలంలో ఈ రేంజ్ సినిమా ఇంతలా అందరికీ ఆకట్టుకోవడం చాలా రోజులకు ఇదే కావడం విశేషం.
ఇక తేజకి సమకాలీన రాజకీయాలపై కూడా మంచి పట్టు ఉంది. అందునా ఈ చిత్రం పొలిటికల్ బ్యాక్‌డ్రాప్ కావడంతో నేటి ఏ పార్టీలను, రాజకీయ నాయకులను ఎలా? ఎప్పుడు టార్గెట్ చేస్తాడో అని ఎదురు చూస్తున్నారు. నేటి రాజకీయాలపై వ్యంగ్యాస్త్రాలు పేలితే మాత్రం సినిమా ఎక్కడికో వెళ్లడం ఖాయం. యూనివర్శల్ సబ్జెక్ట్ కావడం, రానా, కాజల్‌లు నటిస్తుండటంతో ఈ చిత్రాన్ని బాలీవుడ్‌లో కూడా రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
కాగా ఇందులో రానా చెవికి ఓ బంగారు తొడుగు వేసుకుని కనిపిస్తున్నాడు. మొదట్లో అదో లేటెస్ట్ ఫ్యాషన్ అని చాలా మంది భావిస్తూ వచ్చారు. కానీ ప్రత్యర్దులు తుపాకులతో పేల్చినప్పుడు బుల్లెట్ మిస్ అయి చెవికి తగిలి, కొంత భాగం ఊడటంతో శత్రువులపై దానిని చూసిన వెంటన ప్రతీకారేచ్చతో రగిలిపోవడం కోసమే రానా ఆ బంగారు తొడుగును చెవికి వేసుకున్నాడని, అది ఫ్యాషన్ కాదు.. సినిమాలో కీలక మైనఘట్టానికి నాంది అని తెలుస్తోంది.