Advertisementt

'ఖైదీ..' తర్వాత వినాయక్ 'దుర్గ'.!

Tue 04th Jul 2017 08:36 PM
durga,vv vinayak,sai dharam tej,tagore madhu,bujji,vinayak and sai dharam tej  'ఖైదీ..' తర్వాత వినాయక్ 'దుర్గ'.!
Sai Dharam Tej, VV Vinayak Movie Title Durga 'ఖైదీ..' తర్వాత వినాయక్ 'దుర్గ'.!
Advertisement
Ads by CJ

చిరంజీవిని 'ఖైదీ నెంబర్‌ 150' తో వినాయక్‌ సక్సెస్‌పుల్‌గా రీలాంచ్‌ చేశాడు. ఇక చిరంజీవితో పాటు కాజల్‌, రామ్‌చరణ్‌ అందరూ బిజీ అయినా కూడా దర్శకుడు వినాయక్‌ మాత్రం ఆ సినిమా తర్వాత ఖాళీగానే ఉన్నాడు. వినాయక్‌ తన తదుపరి చిత్రాన్ని మెగా మేనల్లుడు సాయిధరమ్‌తేజ్‌తో చేస్తాడని వార్తలు వచ్చాయి. అవి నిజమేనని తాజాగా అందుతున్న సమాచారం. వాస్తవానికి ఈ చిత్రం ఎప్పుడో ప్రారంభం కావాల్సి ఉన్నా కూడా సినిమా బడ్జెట్‌, వినాయక్‌ రెమ్యూనరేషన్‌ల విషయం వల్ల ఆలస్యమైందని సమాచారం. 

ఠాగూర్‌ మధు, నల్లమలుపు బుజ్జిలు ఆల్‌రెడీ సాయితో 'విన్నర్‌', వరుణ్‌తేజ్‌తో 'మిస్టర్‌' నిర్మించి దారుణంగా నష్టాలు చవిచూశారు. దాంతో వారే నిర్మించే సాయిధరమ్‌తేజ్‌ - వినాయక్‌ల చిత్రం బడ్జెట్‌, వినాయక్‌ పారితోషికంగా పలు విషయాలు పెండింగ్‌లో పడ్డాయట. మొత్తానికి ఈ కాంబినేషన్‌ ఇప్పటికి ఓకే అయినట్లు తెలుస్తోంది. ఇక తనకు ఈ మద్య వచ్చిన గ్యాప్‌లో ఆకుల శివ ఇచ్చిన కథని సాయికి తగ్గట్టుగా వినయ్‌ దాదాపు ఫైనల్‌ చేశాడట. ఈ మూవీ టైటిల్ దుర్గ అని రిజిస్టర్ చేసినట్లుగా తెలుస్తుంది. 

మరి వినయ్‌ అంటే భారీ లెవల్లో హీరోయిజం ఉంటుంది. మరి సాయి.. వినయ్‌ చేతిలో పడితే ఎక్కడికో వెళ్లడం ఖాయం అంటున్నారు. మరి వినయ్‌.. సాయితో 'ఆది, దిల్‌' వంటి చిత్రాన్ని ఇస్తాడో..? లేక 'అఖిల్‌' ఫీట్‌ని రిపీట్‌ చేస్తాడో? అనేది చూడాలి. కాగా సెప్టెంబర్‌1న సాయి-బి.వి.ఎస్‌. రవిల చిత్రం 'జవాన్‌' విడుదలకానుంది. వెంటనే వినయ్‌ చిత్రం పట్టాలెక్కే చాన్సుంది..!

Sai Dharam Tej, VV Vinayak Movie Title Durga:

Vinayak is all set to helm a project starring Sai Dharam Tej to be produced by Bujji and Tagore Madhu.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ