యువ హీరోలు నలుగురు కలిసి బుల్లి మల్టి స్టారర్ 'శమంతకమణి' చిత్రంలో కలిసి నటిస్తున్న విషయం తెలిసిందే. టాలీవుడ్ యంగ్ హీరోస్ నారా రోహిత్, ఆది, సుధీర్ బాబు, సందీప్ కిషన్ లు కలిసి.. శ్రీరామ్ ఆదిత్య డైరెక్షన్ లో భవ్య క్రియేషన్స్ నిర్మాణ సారథ్యంలో 'శమంతకమణి' మూవీలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్ లీడ్ రోల్ చేస్తున్నాడు. ఇప్పటికే టీజర్, థియేట్రికల్ ట్రైలర్ తో ఆకట్టున్న ఈ చిత్రం ఈ సోమవారం ప్రీ రిలీజ్ ఈవెంట్ ని కూడా గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకుంది.
అయితే ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిధిగా నందమూరి బాలకృష్ణ హాజరు అవుతారని చెప్పారు. అయితే బాలకృష్ణ రాక కోసం అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూశారు. ఇక బాలకృష్ణ వస్తున్నాడని ఈవెంట్ నిర్వాహకులు కూడా అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా చేశారు. కానీ చివరి నిమిషంలో బాలకృష్ణ ఈ ఈవెంట్ కి హాజరు కాలేకపోయారు. దీనితో ఫ్యాన్స్ కూడా చాలా నిరాశకు లోనయ్యారు. ఇది గమనించిన 'శమంతకమణి' వన్ అఫ్ ద హీరో నారా రోహిత్.. బాలకృష్ణ ఈవెంట్ కి హాజరు కాకపోవడానికి గల కారణం చెప్పాడు.
నిన్న సోమవారం బాలకృష్ణ కి ఫుడ్ పాయిజన్ కావడం వల్లనే 'శమంతకమణి' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రాలేకపోయారని... లేకుంటే తప్పకుండా ఆయన ఈ ఫంక్షన్ కి వచ్చి మిమ్మల్ని ఆనందపెట్టేవారని చెప్పి ఫ్యాన్స్ కి ఊరట కలిగించాడు. ఇక ఈ ఈవెంట్ కి బాలయ్య బాబు కి బదులు 'పైసా వసూల్' డైరెక్టర్ పూరి హాజరయ్యాడు.