త్రివిక్రమ్ ఎప్పుడూ తాను తీసిన సినిమాల్లోని హీరోలనే రిపీట్ చేస్తాడనే పేరుంది. ఒకసారి పనిచేసిన హీరోలతోనే మళ్ళీ పనిచేస్తాడని అంటుంటారు. అందుకే మహేష్ తో, పవన్ తో, అల్లు అర్జున్ తో ఎక్కువగా సినిమాలు చేసాడు. పవన్ తో రెండు సినిమాలు చేసిన త్రివిక్రమ్ మళ్ళీ ఇప్పుడు మరో సినిమాని తెరకెక్కిస్తున్నాడు. అయితే ఈ సినిమా కన్నా ముందు అల్లు అర్జున్ తో రెండు సినిమాలు 'జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి' తీసాక కూడా మూడో సినిమాకి ప్లాన్స్ జరిగాయి. కానీ అది అప్పట్లో వర్కౌట్ అవ్వలేదు.
'సరైనోడు' హిట్ అయ్యాక అల్లు అర్జున్ తన నెక్స్ట్ మూవీ మొదలు పెట్టడానికి టైం తీసుకున్నాడు. ఇక త్రివిక్రమ్ కూడా 'అ... ఆ' సినిమా తర్వాత చాలా ఖాళీ అయ్యాడు. అయితే అప్పట్లో బన్నీ - త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా వస్తున్నట్లు ప్రచారం జరిగింది. కానీ త్రివిక్రమ్, పవన్ తో ఉన్న కమిట్మెంట్ వల్ల బన్నీతో సినిమా చెయ్యలేకపోయాడు. ఇక తర్వాత బన్నీ, హరీష్ శంకర్ డైరెక్షన్ లో 'డీజే' చిత్రం మొదలు పెట్టేసాడు. ఇక త్రివిక్రమ్ కూడా పవన్ కోసం వెయిట్ చేసి చేసి ఎలాగో సినిమాని సెట్స్ మీదకి తీసుకెళ్లాడు. అలాగే 'డీజే' తర్వాత అల్లు అర్జున్ వక్కంతం డైరెక్షన్ లో 'నా పేరు సూర్య...' మూవీ కి షిఫ్ట్ అయ్యాడు.
అయితే ఖచ్చితంగా త్రివిక్రమ్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ నటించాలనుకుంటున్నాడట. ఎందుకంటే పవన్ అభిమానులకు, అల్లు అర్జున్ అభిమానులకు మద్యన ఎప్పటినుండో కోల్డ్ వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. అల్లు అర్జున్ అంటే పవన్ ఫ్యాన్స్ కి అస్సలు పడడంలేదు. అందుకే ఇప్పుడు ఈ సమస్యని అణిచివెయ్యాలంటే పవన్ ఫ్రెండ్ త్రివిక్రంతో అల్లు అర్జున్ గనక నటిస్తే దాదాపు ఈ సమస్య ఆగిపోతుందని భావిస్తున్నారు. కానీ త్రివిక్రమ్ మాత్రం అల్లు అర్జున్ కి దొరుకుతాడంటే కొంచెం అనుమానమే అంటున్నారు.
ఎందుకంటే ఇప్పుడు పవన్ తో చేస్తున్న సినిమా షూటింగ్ ఇంకా పూర్తికాలేదు. అందుకే దసరాకి రావాల్సిన సినిమా నవంబర్ కి వెళ్లిందని టాక్ వినబడుతుంది.ఇక ఆ సినిమా పూర్తికాగానే ఎన్టీఆర్ తో ఒక మూవీ కి కమిట్ అయ్యాడు త్రివిక్రమ్. మరి ఇటు అల్లు అర్జున్ బిజీ, అటు త్రివిక్రమ్ బిజీ కాబట్టి మరో ఏడాదిన్నర వరకు వీరి కాంబోలో మూవీ రావడం కష్టమే. కాకపోతే త్రివిక్రమే.. కావాలని అల్లు అర్జున్ ని సైడ్ చేస్తున్నాడా? అనే డౌట్ క్రియేట్ చేస్తున్నారు కొందరు.