రెండు తెలుగు రాష్ట్రాలలోనూ 'డిజె' దరువు బాగానే ఉంది. ఇక్కడ మొదటి వీకెండ్‌లో రంజాన్ రావడంతో పాటు టాక్‌కి సంబంధం లేకుండా కలెక్షన్లు వస్తున్నాయి. కానీ ఓవర్‌సీస్ ప్రేక్షకుల అభిరుచి వేరు. వారూ తెలుగువారే అయినప్పటికీ తేడా స్పష్టం. రొటీన్ చిత్రాలను వారు భారీ రేట్లకు టిక్కెట్లను కొని, డాలర్లను మనవారి రూపాయిలా బూడిదలో పోసిన పన్నీరు చేయరు. వారికి డబ్బు కంటే సమయం ఇంకా విలువైంది, ప్రతి నిమిషాన్ని,గంటను వారు డబ్బుతో బేరీజు వేసుకుంటారు.
ఎక్కువగా రివ్యూలు, టాక్‌పై ఆధారపడతారు. 'బాహుబలి-ది కన్‌క్లూజన్' చిత్రం ఏకంగా యూఎస్‌లో 20 మిలియన్లు వసూలు చేయడం చూసి తెలుగు సినిమా మార్కెట్ బాగా పెరిగిందని, అందులోనూ 'డిజె' అవుట్ అండ్ ఎంటర్‌టైనర్‌గా భావించి అక్కడి బయ్యర్లు ఏకంగా 9కోట్లకు హక్కులు కొనేశారట. ప్రీమియంషోలు, మొదటి రోజు కలెక్షన్లు బాగానే ఉన్నా వీకెండ్ తర్వాత సో డల్. 'డిజె' ట్రిప్ కూడా వర్కౌట్ కాలేదని సమాచారం.
ఈ చిత్రం కనీసం 2 మిలియన్లు వసూలు చేస్తే గానీ ప్రాబ్లమ్‌తీరదు. కానీ ఓవరాల్ లాంగ్‌రన్‌లో 1.5 మిలియన్ల దగ్గరే ఆగిపోతుందని, 'నిన్నుకోరి' వస్తే పరిస్థితి దిగజారుతుందని అంటున్నారు. ఎటు లేదన్నా యూఎస్ హక్కులు కొన్నవారికి కనీసం 4కోట్లు కోత తప్పదు. దాంతో మన 'డిజె' టీం దిగులుపడకురా సహోదరా.. అంటూ 'ఫిదా'వంటి చిత్రాలకు, మరీ ముఖ్యంగా శేఖర్ కమ్ములకు ఉన్న ప్లస్ రీత్యా 'డిజె' నష్టాలను 'ఫిదా'తో కవర్ చేద్దామని మాట ఇచ్చారట. మొత్తానికి కొత్తదనం నిండిన 'క్షణం, పెళ్లిచూపులు' వంటివే తమకు మంచిదని ఓవర్‌సీస్ బయ్యర్లు కూడా ఏకగ్రీవ తీర్మానానికి రెడీ అవుతున్నారు..!