నాగ చైతన్య- సమంతల పెళ్లి అక్టోబర్ 6న జరగనుంది. కానీ మనోడు మాత్రం వరుస చిత్రాలతో ముందుకు తోసుకుని వెళ్లున్నాడు. 'ప్రేమమ్, రారండోయ్ వేడుక చూద్దాం'ల తర్వాత మరోసారి మాస్ ప్రయోగమే చేస్తున్నట్లు ఉంది. అది కూడా మంచి టేస్ట్ ఉన్న సాయి కొర్రపాటి వారి వారాహి బేనర్‌లో కావడం విశేషం, కృష్ణ వైరిముత్తు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ 'యుద్దం శరణం' టైటిల్, ఫస్ట్‌లుక్స్‌తోనే మంచి స్పందన రాబట్టాడు.
కాగా చైతు కూడా తన తండ్రి నాగార్జున బాటలోనే పయనిస్తున్నట్లు అర్దమవుతోంది. ఒకసారి నచ్చిన దర్శకులకి, కొత్త టాలెంట్‌కు నాగ్ ఎంత విలువ ఇస్తాడో చైతూ కూడా అదే దారిలో నడుస్తున్నాడు. తనకు 'ప్రేమమ్' వంటి హిట్ ఇచ్చిన చందుమొండేటి దర్శకత్వంలో మరో చిత్రానికి ఓకే చెప్పాడు. ఇక ఇప్పుడు కృష్ణ వైరిముత్తు అనే నూతన దర్శకుడి 'యుద్దం శరణం' తర్వాత చందుమొండేటి మరో చిత్రంతో పాటు వారిహి చలన చిత్రం బేనర్‌లోనే సాయి కొర్రపాటికి మరో సినిమా కూడా చేస్తానని అగ్రిమెంట్ ఇచ్చాడట.
కాగా కృష్ణవంశీ శిష్యురాలిగా పరిచయమైన నందిని రెడ్డి బాగానే వెళ్తున్న నేపథ్యంలో మరో కృష్ణవంశీ వద్ద శిష్యరికం చేసిన సౌజన్య అనే మరో దర్శకురాలికి కూడా చైతూ ఓకే చెప్పాడట. కృష్ణవంశీ ఒక్కసారి ఆమె కథ వినమనండంతో ఆమె కథ లైన్ విన్న చైతూకి ఆ స్టోరీ బాగా నచ్చడంతో ఈ లేడీ డైరెక్టర్‌కి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడు.
కాగా తెలుగులో భానుమతి, సావిత్రి, విజయ నిర్మల, బి.జయ, మంజులా నాయుడు, మహేష్ సోదరి మంజుల, నందిని రెడ్డి, ఇప్పుడు కొత్తగా సౌజన్యలు దర్శకురాళ్లుగా మారుతుంటే, వీరైనా మన మగ డైరెక్టర్స్‌లాగా, సెక్స్, హింస, మితిమీరిన శృంగారం వంటివి పక్కనపెట్టి మనసులను హత్తుకునే చిత్రాలను తీస్తారేమో వేచిచూడాల్సివుంది...!