ఇక తాను వోడ్కా మానేస్తున్నానని, ఇకపై తాను ఎవ్వరి మీదా ట్వీట్స్ చేయనని చెప్పి, ట్విట్టర్ అకౌంట్‌కి బై చెబుతున్నానని చెప్పి, షార్ట్ ఫిల్మ్స్ మీద పడేసరికి కొందరు హమయ్య... అని ఊపిరి పీల్చారు. అలా చెప్పాడో లేదో మరో నెలలోనే మరలా తన చేతికి పని చెప్పాడు. మాట్లాడే నాలుక, ట్వీట్ చేసే చేయి ఎప్పుడు ఖాళీగా ఉండవని మరోసారి నిరూపించాడు. తాజాగా ఆయన సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నాయకులను కూడా టార్గెట్ చేస్తూ తన దృష్టిలో వారేంటో చెప్పే ప్రయత్నం చేశాడు.
ఏపీ సీఎం చంద్రబాబునాయుడుని నవ్వు లేని నాయకుడిగా పోల్చాడు. జగన్‌ని 'సన్ ఇన్ ఇనుము (ఐరన్) అంటూ కొత్తపేరు పెట్టి వెటకారం చేశాడు. పవన్ కళ్యాణ్‌ని రాజకీయ వేత్తగా చెబుతూనే, వెయిట్ అండ్ వాచ్ అంటూ సంబోధించాడు. రాజమౌళిని మెస్సయ్యా ఆఫ్ ఫిల్మ్స్ అని, ప్రభాస్‌ని సెక్సీయెస్ట్ పవర్ అని, జూనియర్ ఎన్టీఆర్ రిపీటింగ్ సీనియర్ ఎన్టీఆర్, నాగార్జునను లవ్, చిరంజీవిని స్టార్ మెగా, బన్నీని డేంజరస్ రాబిట్, రామ్ చరణ్‌ని ధీరుడైన మగాడుగా, నాగబాబుని లవ్‌లీ బ్రదర్ అంటూ సంబోందించాడు.
మొత్తానికి వర్మ కృషి మెచ్చుకోవలసిందే.. ఎందుకంటే పెద్దగా వివాదాలకు జోలికి కాకుండా ఎక్కడో చూసి చూడనట్లు ఓ చిన్న దెబ్బేసి వెంటనే వెన్న పూశాడనే చెప్పాలి.