మన తెలుగు హీరోలు బహుభాషా స్టార్స్ గా ఎదిగే ప్రయత్నం చేస్తున్నారు. ఇది అభినందనీయమే. తమిళ సినిమాలను ఒకేసారి తెలుగు, తమిళ్ లో రిలీజ్ చేస్తారు. దీనివల్ల టాక్ కి సంబంధం లేకుండా ఓపెనింగ్స్ వస్తాయి. ఈ పద్దతిని దిల్ రాజు మరిచారు. తన కొత్త చిత్రం 'డిజె' కలెక్షన్లలో ఉదరకొడుతోందని ప్రకటనలు ఇస్తున్నారు. కానీ మలయాళ, తమిళ్ భాషల్లో రిలీజ్ చేయడానికి మీనమేషాలు లెక్కిస్తున్నారు.
మలయాళంలో అల్లు వారబ్బాయికి తెగ ఫాలోయింగ్ ఉందంటారు. కానీ 'డిజె'ను ఇప్పటి వరకు రిలీజ్ చేయలేదు. నిజానికి 'బాహుబలి'లాగా ఒకే సారి డబ్బింగ్ చేసి రిలీజ్ చేసుకుంటే బావుండేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తమిళంలో ఓ సినిమా కమిటైన అల్లు అర్జున్ అక్కడి మార్కెట్ లో పాగా వేయాలని ప్లాన్ చేస్తున్నాడు. ఈ అవకాశాన్ని'డిజె' ద్వారా ఉపయోగించుకుంటే బావుండేది.
'డిజె' వందకోట్లు దాటేసిందని చెబుతున్నారు. కానీ, విదేశీ మార్కెట్ కలెక్షన్ల గురించి మాత్రం స్పష్టత లేదు. అక్కడ పది కోట్లు వసూలు చేస్తుందా? అని విదేశీ మార్కెట్ ప్రతినిధులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఒక సినిమా హిట్ అయితే అన్ని ప్రాంతాల్లో కలెక్షన్లు రాబడుతుంది. కానీ 'డిజె' వ్యవహారం దీనికి విరుద్ధంగా ఉంది. ముఖ్యంగా ఓవర్ సీస్ లో చతికిలపడిందని టాక్.