యంగ్ టైగర్ ఎన్టీఆర్ జై లవ కుశ టీజర్ మరో మూడు రోజుల్లో రానుంది. టీజర్ ద్వారా అభిమానుల్లో, పరిశ్రమలో ఆసక్తి కలిగించేందుకు యూనిట్ కసరత్తు చేసింది. తొలిసారి మూడు పాత్రలు చేస్తున్న ఎన్టీఆర్ పాత్రలపై ఇప్పటికే క్యూరియాసిటి ఏర్పడింది. సోదరుడు కల్యాణ్ రామ్ కు టేబుల్ ప్రాఫిట్ తెచ్చే చిత్రంగా ఎన్టీఆర్ జాగ్రత్తలు తీసుకున్నారని తెలిసింది.
లవ కుశ అనగానే అర్థశతాబ్దం క్రితం వచ్చిన మహానటుడు ఎన్టీఆర్ సినిమా గుర్తుకు రాకమానదు. చిత్ర చరిత్రలో అజరామరంగా నిలిచిన లవ కుశ పేరుతో ఆయన మనవడు నటిస్తున్న సినిమా అంటే బాధ్యతతో పాటు అంచనాలుంటాయి. తాతయ్య నటించిన లవకుశ సినిమా లోగోనే తన కొత్త సినిమాకు ఉపయోగించుకోవడం వల్ల మనవళ్ళుఇద్దరూ జాగ్రత్త పడ్డారు. ఓ గొప్ప సినిమా పేరుతో తీస్తున్నపుడు ఈ మాత్రం జాగ్రత్తలు అభినందనీయమే.