Advertisementt

'అది నిజం కాదు' అంటూ..నాగ్ క్లారిటీ...!

Mon 03rd Jul 2017 06:14 PM
nagarjuna,boyapati srinu,naga chaitanya,cinejosh twitter,nagarjuna twitter  'అది నిజం కాదు' అంటూ..నాగ్ క్లారిటీ...!
Nagarjuna Clarifies Boyapati and Naga Chaitanya Movie News 'అది నిజం కాదు' అంటూ..నాగ్ క్లారిటీ...!
Advertisement
Ads by CJ

అక్కినేని నాగార్జున ఇప్పుడు కొడుకుల కెరీర్ ని గాడిలో పెట్టేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు. అందుకే కొడుకుల సినిమాలకు నిర్మాతగా కూడా మారాడు. నాగచైతన్యతో 'రారండోయ్ వేడుక చూద్దాం' చిత్రాన్ని నిర్మించిన నాగ్, అఖిల్ రెండో సినిమా నిర్మాత కూడా తనే. అయితే ఇప్పుడు నాగ్ మీద ఒక న్యూస్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. అదేమిటంటే నాగ చైతన్యని మాస్ హీరోగా నిలబెట్టాలనే ప్రయత్నంలో మాస్ డైరెక్టర్ అయిన బోయపాటి శ్రీనుని రంగంలోకి దింపుతున్నాడనే ప్రచారం సోషల్ మీడియాలో హోరెత్తింది. 

బోయపాటి శ్రీను, నాగ చైతన్య సినిమాని డైరెక్ట్ చెయ్యడానికి ఒక మంచి మాస్ కథని తయారు చెయ్యమని నాగ్ చెప్పినట్లు... దానికి గాను బోయపాటికి 12 కోట్ల రూపాయల పారితోషికం నాగ్ ఆఫర్ చేసినట్లు వార్తలొచ్చాయి. అయితే బోయపాటికి 12 కోట్ల పారితోషికం ఇవ్వడంపై సినీజోష్ ప్రచురించిన వార్తకు నాగ్ సోషల్ మీడియాలో స్పందించాడు. బోయపాటి తో నాగ్ చైతన్య సినిమా వార్తలను ఖండించిన నాగ్ అది నిజం కాదు అంటూ ఒక ట్వీట్ తో క్లారిటీ ఇచ్చేశాడు.

సో ఈ లెక్కన బోయపాటి - నాగ్ చైతన్య కాంబినేషన్లో మూవీ అనేది ప్రస్తుతానికి లేదని నాగ్ చెప్పేశాడు.

Click Here to Follow Cinejosh Twitter  

Nagarjuna Clarifies Boyapati and Naga Chaitanya Movie News:

Nagarjuna Reacted on Cinejosh Post on Twitter.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ