Advertisementt

మహేష్ తో మాస్ డైరెక్టర్ చిత్రం..?

Mon 03rd Jul 2017 06:03 PM
mahesh babu,koratala siva,murugadoss,spyder,boyapati sreenu  మహేష్ తో మాస్ డైరెక్టర్ చిత్రం..?
Boyapati Srinu Directs Mahesh Babu మహేష్ తో మాస్ డైరెక్టర్ చిత్రం..?
Advertisement
Ads by CJ

ఒక పక్క మురుగదాస్ 'స్పైడర్' షూటింగ్ తో బిజీగా వున్న మహేష్ మరో పక్క కొరటాల 'భరత్ అను నేను' చిత్ర షూటింగ్ లో కూడా జాయిన్ అవడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. ఇక ఈ దసరాకి స్పైడర్ తో దిగుతున్న మహేష్, వచ్చే సంక్రాంతికి కొరటాల డైరెక్షన్ లో వచ్చే 'భరత్ అను నేను' సినిమాతో బరిలోకి దిగనున్నాడు. కొరటాల సినిమా పూర్తికాగానే తన 25 వ చిత్రాన్ని వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో కమిట్ అయ్యాడు మహేష్ బాబు.

అయితే వంశీ  పైడిపల్లి సినిమా తర్వాత మహేష్ బాబు మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ రాజమౌళితో జతకట్టనున్నట్లు వార్తలొచ్చాయి. ఇక ఇదే విషయాన్నీ రాజమౌళి కూడా చెబుతున్నాడు. తాను మహేష్ తో ఒక సినిమా చెయ్యాలనే కమిట్మెంట్ తో ఉన్నానని...... కాకపోతే ఎప్పుడనేది క్లారిటీ ఇవ్వలేదు. అయితే ఇప్పుడు మహేష్.. వంశీ పైడిపల్లి సినిమా తర్వాత ఒక మాస్ సినిమా చెయ్యాలనుకుంటున్నాడట.

అందుకే టాలీవుడ్ మాస్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న బోయపాటితో తన 26వ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. అయితే ఈ మధ్యనే మీట్ అయిన బోయపాటి, మహేష్ ఫ్యూచర్ లో కలిసి పనిచేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. కానీ ఈ విషయంలో ఎటువంటి అధికారిక ప్రకటన ప్రస్తుతానికి వెలువడలేదు. అన్ని రకాలుగా ఈ మూవీ సెట్ అయితే బోయపాటి, చిరుతో చేసే సినిమా తర్వాత మహేష్ తో సినిమా ఉండొచ్చని అంటున్నారు.

Boyapati Srinu Directs Mahesh Babu:

Super star Mahesh babu and mass director Boyapati Srinu combo film soon.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ