నాగార్జున చాలా మందికి ప్రతి విషయాన్ని ఓ బిజినెస్‌లా చూసే వ్యాపారవేత్తగా భావిస్తారు. కానీ హీరోలు బుల్లితెరపై కనిపించేందుకు ఫీలయ్యే నాటి రోజుల్లోనే ఆయన రాజకీయ పార్టీగా మారకముందు జయప్రకాష్ నారాయణ్ లోక్‌సత్తాకు ఉచితంగా యాడ్ చేశాడు. 'లోక్‌సత్తా.. ఇది మీ సత్తా' అంటూ తన మనసులోనిది చాటుకున్నాడు. తర్వాత కూడా ఎయిడ్స్, ఓటు హక్కులతో పాటు వైఎస్ హయాంలో కూడా పలు సంక్షేమ పథకాలను అందరికీ చేరవయ్యేలా చేశాడు.
ఇక ఆయన భార్య అమల రెడ్‌క్రాస్‌కి పనిచేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఓ ప్రైవేట్ ఆసుపత్రి ఆద్వర్యంలో జరిగిన అవయవ దాన విషయంలో అందరికీ అవగాహన కల్పించేందుకు నిర్ణయించుకున్నాడు. ప్రతి ఒక్కరు ఆర్గాన్‌డోనేషన్‌ను అవగాహన చేసుకోవాలని, చనిపోయిన తర్వాత కూడా తమ అవయవాలతో పలువురి జీవితాలలో ఆనందం నింపి నిజమైన సూపర్ హీరోలుగా నిలవండని అందరికీ దీని గురించి అవగాహన కల్పించారు.
మూఢనమ్మకాలను వదిలిపెట్టి ప్రతి ఒక్కరు చనిపోయిన తర్వాత అవయవదానాలు చేసేందుకు ముందుకు రావాలని కోరుతున్నాడు. మొత్తానికి ఇంత బిజీగా అటు వైపు తానే హీరోగా సినిమాలు, మరోవైపు తన పెద్ద కొడుకు నాగ చైతన్య, సమంతల పెళ్లి కార్యక్రమాలు, నిర్మాతగా చిన్నకొడుకు చిత్రాలు నిర్మిస్తూనే ఆయన ఇలాంటి వాటికి కూడా సమయం కేటాయించడం పట్ల హర్షం వ్యక్తమవుతోంది.