'బాహుబలి' చిత్రంతో ప్రభాస్ నేషనల్ స్టార్ అయిపోయాడు. ఇక ఆయనతో కలిసి నటించడానికి పలువురు బాలీవుడ్ హీరోయిన్లు ఆకస్తి చూపుతున్నారు. అయినా శ్రద్దాపూర్ నో చెప్పిందట. ఇక 'సాహో' అనగానే మొదటగా వినిపించిన పేరు కత్రినాకైఫ్. ఈ బాలీవుడ్ పొడుగు కాళ్ల సుందరి ఇంతకు ముందే వెంకటేష్ సరసన లీడ్‌రోల్‌లో 'మల్లీశ్వరి' ద్వారా మెప్పించింది. కానీ బాలయ్య 'అల్లరి పిడుగు' దెబ్బకు తట్టుకోలేక బాలీవుడ్‌కి పరుగెత్తింది.
ఒక విషయం ఏమిటంటే.. ఏ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయినా ఒక్కసారి దక్షిణాది చిత్రాలకు ఓకే చెబితే చాలు... ఇక బాలీవుడ్‌ని వదిలి దక్షిణాది ఎప్పుడు పిలుస్తుందా? అనేంతగా ఎడిక్ట్ అవుతారు. అసలు ఇప్పటి వరకు దక్షిణాదిలో చేయని శ్రద్దాపూర్‌కి ఆ విషయం తెలిసినట్లు లేదు. బాలీవుడ్ చిత్రాలలాగా ఇక్కడ ఏళ్లకు ఏళ్లు చిత్రాలను తీయరు. ఏ బాహుబలి, లేదా '2.0'లకి తప్పితే, మిగిలిన చిత్రాలను 100 రోజుల లోపే పూర్తి చేస్తారు.
కాబట్టి హీరోయిన్లకు ఒక 20 రోజులు కాల్షీట్స్ ఇస్తే సరిపోతుంది. కాగా తాజాగా జరిగిన సైమా అవార్డు వేడుకల్లో 'జగ్గాజాసూస్'కి చెందిన ప్రమోషనల్ ఈవెంట్‌ని కూడా నిర్వహించారు. దీనికి హీరో రణబీర్ మాజీ ప్రేయసి కత్రినాకైఫ్ వచ్చింది. ఆమెను దక్షిణాదిలో ఏ హీరోతో చేయాలని ఉంది అని అడిగితే విక్రమ్ అంటే చాలా ఇష్టం.. ఇక 'బాహుబలి'లో ప్రభాస్‌కి హ్యాట్సాఫ్ అని చెప్పింది. మొత్తానికి కత్రినా ప్రభాస్‌కి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిందనే భావించాలి.