ప్రస్తుతం 'బాహుబలి' తర్వాత దేశం మొత్తం ఏ బాలీవుడ్ చిత్రం కోసమో ఎదురు చూడటం లేదు. రజినీకాంత్, అక్షయ్‌కుమార్, శంకర్‌ల కాంబినేషన్‌లో రూపొందుతున్న '2.' కోసమే ఎదురుచూస్తున్నారు. కాగా ఈ చిత్రం విడుదలకు చాలా సమయం ఉండటంతో ఈ చిత్రం గురించి రజినీ గానీ, శంకర్‌గానీ, అక్షయ్‌కుమార్ గానీ మాట్లాడలేదు. కానీ ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరు... లైకా ప్రొడక్షన్స్‌లో కీలకమైన రాజు రామలింగం మాట్లాడుతూ, హాలీవుడ్‌లోని రోబో చిత్రాలకు '2.0'కు అసలు పోలికే ఉండదు.
హాలీవుడ్ చిత్రాలకు ధీటుగా మాత్రం ఉంటుంది. సంక్రాంతికే విడుదల చేయాలని భావించినా అన్ని భాషల్లో సోలో మూవీగా రావాలని జనవరి 25కు వెళ్లాం. ఈ చిత్రం కోసం 400కోట్లకు పైగా బడ్జెట్‌ను కేటాయించాం. ఈ చిత్రంలో విలన్ పాత్రకు అర్నాల్డ్‌ని అనుకున్న మాట వాస్తవమే. కానీ ఆయన కండీషన్లు మాకు నచ్చలేదు. విలన్‌గా అక్షయ్‌కుమార్ అదరగొట్టాడు. ఇక ఈ చిత్రం గ్రాఫిక్స్‌కి, వీఎఫ్‌ఎక్స్‌లకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండటంతో దాని కోసం భారీ బడ్జెట్ కేటాయించాం.
ఇక 'బాహుబలి' రిలీజ్ తర్వాత మేమేం ఎలాంటి మార్పులు, చేర్పులు చేయలేదు. ముందుగా ఏది అనుకున్నామో అదే తీస్తున్నాం. రిలీజ్‌డేట్‌ను కూడా 'బాహుబలి' రిలీజ్‌కు ముందే ప్రకటించాం.. అంటూ చెప్పి ఈ చిత్రంపై ఉన్న అంచనాలను విపరీతంగా పెంచేశాడు.