Advertisementt

ప్రభాస్ తో మళ్లీ అవకాశం పోగొట్టుకుంది!

Sun 02nd Jul 2017 02:27 PM
sonam kapoor,prabhas,saaho,baahubali,avanthika  ప్రభాస్ తో మళ్లీ అవకాశం పోగొట్టుకుంది!
Sonam Kapoor Again Missed Prabhas Movie Chance ప్రభాస్ తో మళ్లీ అవకాశం పోగొట్టుకుంది!
Advertisement
Ads by CJ

చింత చచ్చినా పులుపు చావలేదనే సామెత అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ సామెత బాలీవుడ్‌ హీరోయిన్‌ సోనమ్‌కపూర్‌కి సరిగ్గా సూట్‌ అవుతుందనే కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. వాస్తవానికి 'బాహుబలి'తో నేషనల్‌ ఐకాన్‌గా మారిన ప్రభాస్‌ సరసన నటించడానికి పెద్దగా కష్టపడనవసరం లేదు. నేడు ఆయనకు ఒక్క బాలీవుడ్‌లోనే కాదు.. అంతకు మించి దక్షిణాదిలోని తెలుగు, తమిళ, మలయాళం వంటి భాషల్లో కూడా విపరీతమైన క్రేజ్‌ ఉంది. ముఖ్యంగా యువతరం, లేడీస్‌ నుంచి చిన్నపిల్లల వరకు ఆయనంటే పడిచచ్చిపోతున్నారు. ఆయనకు కేవలం టాలీవుడ్‌లోనే ఓ మోస్తరు క్రేజ్‌ ఉన్నప్పుడే బాలీవుడ్‌ క్వీన్‌ కంగనారౌనత్‌ ఆయనతో 'ఏక్‌ నిరంజన్‌' చిత్రంలో నటించింది. ఇక నేడు ప్రభాస్‌ టాలీవుడ్‌లో దానికి భిన్నం. 

ఆయన నటించిన 'బాహుబలి'కి తెలుగులో కూడా పబ్లిసిటీ చేస్తే అసలే ఆకాశాన్నంటే హైప్‌ ఉన్న ఆయనకు మరింత హైప్‌కి పెంచడం ఇష్టం లేక దక్షిణాదిలో పెద్దగా ప్రమోషన్‌ చేయకుండా కేవలం బాలీవుడ్‌లోనే ప్రమోషన్‌ చేయడాన్ని బట్టి ఆయనకు ఇక్కడ ఉన్న స్టామినా ఏమిటో స్పష్టంగా తెలుస్తుంది. నేడు ప్రభాస్‌తో ఒక చిత్రంలో చేస్తే ఆ హీరోయిన్‌కి బాలీవుడ్‌లో కాకపోయినా దక్షిణాది అవకాశాలు వెల్లువలా వచ్చే పరిస్థితి ఉంది. ఇక బాలీవుడ్‌ హీరోయిన్‌ సోనమ్‌కపూర్‌ విషయానికి వస్తే ఆమెకు 'బాహుబలి'లో మొదట తమన్నా పోషించిన అవంతిక పాత్ర ఆమె వద్దకే వెళ్లింది. మరి కారణాలేమైనా ఈ పాత్రను ఆమె చేయలేదు.

ఇక 'సాహో' చిత్రం కోసం కూడా దర్శకనిర్మాతలు మొదటగా ఆమెనే సంప్రదించి కథను ఇచ్చారట. ఆమెకు కథ నచ్చినా కూడా ఎందుకో మౌనంగా ఉండిపోయి తలుపులు క్లోజ్‌ చేసిందంటున్నారు. కథ నచ్చి, పారితోషికం నచ్చలేదా? పోనీ ఆమెమైనా బాలీవుడ్‌లో నెంబర్‌ వన్‌గా వెలుగొందుతోందా? అంటే అదీ లేదు. సోనమ్‌ వైపు నుంచి మాత్రం ఈ చిత్ర దర్శకనిర్మాతలు ఆమెను హోల్డ్‌లో ఉంచి, వేరొక్కరితో కూడా మంతనాలు సాగిస్తుండటంతో ఆమెకు కోపం వచ్చిందని, తప్పంతా దర్శకనిర్మాతలదే అంటున్నారు. మొత్తానికి 'సాహో' చిత్రానికి కూడా సోనమ్‌కపూర్‌ దాదాపు నో చెప్పేసినట్లేనని ప్రచారం మాత్రం జరుగుతోంది...! 

Sonam Kapoor Again Missed Prabhas Movie Chance:

Bollywood Heroine Sonam Kapoor Rejected Prabhas Saaho Heroine Chance. Already She Missed Baahubali Chance. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ