డబ్బులిస్తేనే డబ్బింగ్ చెబుతాను అంటూ హీరోగారు భీష్మించుకోవడంతో సినిమా విడుదల పోస్ట్‌పోన్ అయింది. సినిమా విడుదలకు హీరోనే అడ్డుతగులుతున్నాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయు టాలీవుడ్ లో. విషయానికి వస్తే సునీల్ నటిస్తున్న 'ఉంగరాల రాంబాబు' డబ్బింగ్ స్టేజీలో ఆగింది. తన పాత్రకు డబ్బింగ్ చెప్పాల్సిన సునీల్ బ్యాలెన్స్ ఇస్తేనే చెబుతాను అంటూ నిర్మోహమాటంగా చెప్పేశాడు. అంతేకాదు డబ్బు సర్దుబాటు చేయండీ అని చెప్పేసి అమెరికా చెక్కేశాడు. అక్కడ ఎన్. శంకర్ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నాడు.
చిన్న మొత్తానికే సునీల్ ఇలా ప్రవర్తించడం దర్శక, నిర్మాతలను ఆశ్చర్యపరిచింది. సునీల్‌కు హీరోగా మార్కెట్ లేనప్పటికీ, ధైర్యంగా సినిమా తీసిన నిర్మాతను అభినందించాలి. అంతేకాదు హీరో ఛాన్స్ కొట్టేసిన సునీల్ కృతజ్ఞతగా ఉండాలి. కానీ సినీఫీల్డ్‌లో అలాంటి సెంటిమెంట్స్ ఉండవు. 'జక్కన్న' చిత్రం తర్వాత సునీల్ మార్కెట్ దారుణంగా పడింది. ఆయన సినిమాలను కొనే నాథుడే లేడు.