దసరాకి తమ తమ సినిమాలతో సందడి చేస్తామని ముగ్గురు హీరోలు హడావిడి చేస్తున్నారు. ఈసారి దసరాని క్యాష్ చేసుకోవటానికి మూడు బడా సినిమాలు లైన్ లో కొచ్చేశాయి. బాలకృష్ణ - పూరి జగన్నాద్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 'పైసా వసూల్' ని సెప్టెంబర్ 27 న విడుదల చేస్తున్నట్లు ముందుగా ప్రకటించారు. అలాగే మురుగదాస్ -మహేష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 'స్పైడర్' చిత్రాన్ని కూడా దసరా బరిలో దించుతున్నట్లు ఆఫీషియల్ గా ప్రకటించారు కానీ పక్కా డేట్ చెప్పలేదు. అలాగే మరొక బడా మూవీ 'జై లవ కుశ' చిత్రంతో డైరెక్టర్ బాబీ - జూనియర్ ఎన్టీఆర్ లు కూడా దసరా కే వస్తున్నామని... సెప్టెంబర్ 21 న సినిమా విడుదల అంటూ అనౌన్స్ చేశారు.
మరి పెద్ద సినిమాలు 10 రోజుల గ్యాప్లోనే థియేటర్లులోకి వస్తున్నాయి అంటే ఆ సినిమా కలెక్షన్స్ మీద విపరీతమైన ఎఫెక్ట్ పడే ప్రమాదం వుంది. ఇక ఎన్టీఆర్ సినిమా 'జై లవ కుశ' సెప్టెంబర్ 21 న విడుదల చేయబోతున్నట్లు నిర్మాత కళ్యాణ్ రామ్ చెబుతున్నాడు. మరి ఎన్టీఆర్ సినిమా విడుదలైన వారానికే బాలకృష్ణ 'పైసా వసూల్' రావడంతో 'జై లవ కుశ' చిత్ర కలెక్షన్స్ మీద తీవ్ర ప్రభావం పడే అవకాశం వుంది. మళ్ళీ ఈ మధ్యలో మురుగదాస్, మహేష్ తమ సినిమా 'స్పైడర్' కి ఎప్పుడు డేట్ ఫైనల్ చేస్తారో తెలియకుండా వుంది.
మరి ఈ లెక్కన సినిమా సినిమాకి మధ్యలో 15 రోజుల గ్యాప్ ఉంటే మంచిదని అంటున్నారట ఈ మూడు సినిమాలు కొంటున్న బయ్యర్లు. లేకుంటే తాము తీవ్రంగా నష్టపోతామని చెబుతున్నారట. మరీ ముఖ్యంగా జై లవ కుశ బయ్యర్లు నిర్మాత కళ్యాణ్ రామ్ దగ్గర సినిమా డేట్ ని కాస్త ముందుకు జరపమని వేడుకుంటున్నారట. అలా చేస్తే కలెక్షన్స్ కి ఎటువంటి ఢోకా ఉండదని చెబుతున్నారట. కానీ షూటింగ్ ప్రోగ్రెస్ ప్రకారం సినిమాని ముందుకు జరిపే ఛాన్స్ లేదని తేల్చి చెప్పేశాడట 'జై లవ కుశ' నిర్మాత కళ్యాణ్ రామ్. పాపం మూడు సినిమాలతో ప్రేక్షకులు హ్యాపీయే గాని బయ్యర్లు కు మాత్రం తీవ్ర నష్టం తప్పదన్నమాట.