Advertisementt

ఏవండోయ్..ఈ జగన్నాధ శాస్త్రిని చూశారూ..!

Sat 01st Jul 2017 06:15 PM
allu sirish,duvvada jagannadham,siima,siima 2017,allu arjun  ఏవండోయ్..ఈ జగన్నాధ శాస్త్రిని చూశారూ..!
Allu Sirish DJ Get Up at SIIMA 2017 ఏవండోయ్..ఈ జగన్నాధ శాస్త్రిని చూశారూ..!
Advertisement
Ads by CJ

డీజే చిత్రంలో దువ్వాడ జగన్నాథం గా అల్లు అర్జున్ రచ్చ రంబోలా చేసిన విషయం తెలిసిందే. బ్రాహ్మణ పాత్రలో అల్లు అర్జున్ బాగానే మెప్పించాడనే కామెంట్స్ పడ్డాయి. అలాగే బ్రాహ్మణ యాస మాట్లాడడానికి అల్లు అర్జున్ బాగా హార్డ్ వర్క్  కూడా చేసాడు. అయితే అల్లు అర్జున్ ఫిజిక్ మాత్రం బ్రాహ్మణ పాత్రకు సరిగ్గా అతికినట్టు సరిపోయింది. ఇక సినిమా టాక్ ఎలా ఉన్నప్పటికీ డీజే చిత్రం కలెక్షన్స్ సునామి కురిపిస్తూ 100  కోట్ల క్లబ్బులోకి అడుగుపెట్టింది.

అయితే దువ్వాడ జగన్నాథంగా అల్లు అర్జున్ బ్రాహ్మణ పాత్రలో మెరిసినట్టే ఆయన తమ్ముడు అల్లు శిరీష్ కూడా ఇప్పుడు బ్రాహ్మణ అవతారం ఎత్తాడు. అల్లు శిరీష్ బ్రాహ్మణ అవతారం ఏమిటా అని కంగారు పడకండి. శిరీష్ ఈ అవతారమెత్తడానికి కారణం అబుదాబిలో జరుగుతున్న  సైమా అవార్డ్స్. వాటి కోసం ఇలా బ్రాహ్మణ లుక్ లోకి కాదు కాదు తన అన్న గెటప్ లోకి మారిపోయాడు. అల్లు శిరీష్ ఈ మధ్యన టాలీవుడ్ లో జరిగే అవార్డు ఫంక్షన్స్ కి గట్రా హోస్ట్ గా చేస్తూ మెప్పిస్తున్నాడు. ఇక ఇప్పుడు సైమా వేడుకల్లో అల్లు శిరీష్.. మంచు లక్ష్మి తో కలిసి అదరగొట్టేసాడట.  బ్రాహ్మణ గెటప్ లో అల్లు శిరీష్ అదరగొట్టాడని... మంచి వాక్చాతుర్యంతో సెలెబ్రిటీస్ ని ఆకట్టుకున్నాడని అంటున్నారు.

మరి అలా సైమా వేడుకల్లో హోస్ట్ గా బ్రాహ్మణ లుక్ లో అలరించిన  అల్లు శిరీష్ మాంచి కామెడీ టైమింగ్ తో అక్కడున్నవాళ్ళని బాగా ఎంటర్టైన్ చేసాడట. మరి అన్న అల్లు అర్జున్ డీజే లో దువ్వాడగా ఇరగదీస్తే  ఇప్పుడు తమ్ముడు సైమా లో శాస్త్రి గా ఇరగదీసాడంటున్నారు. అదండీ అల్లు శిరీష్ బ్రాహ్మణ లుక్ అసలు కథ.

Allu Sirish DJ Get Up at SIIMA 2017:

Allu Sirish In Allu Arjun DJ Duvvada Jagannadham Get Up In SIIMA 2017

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ