Advertisementt

ఈ కుర్రాళ్ళకి అమ్మాయిలతోనే ప్రాబ్లమంట..!

Sat 01st Jul 2017 06:11 PM
shamantakamani trailer,sudheer babu,sundeep kishan,nara rohit,aadi,shamantakamani trailer review  ఈ కుర్రాళ్ళకి అమ్మాయిలతోనే ప్రాబ్లమంట..!
Shamanthakamani Trailer Released ఈ కుర్రాళ్ళకి అమ్మాయిలతోనే ప్రాబ్లమంట..!
Advertisement
Ads by CJ

'భలే మంచిరోజు'తో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య తన రెండో ప్రయత్నాన్ని టాలీవుడ్ లోని నలుగురు యువహీరోలను జతచేసి 'శమంతకమణి' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. నారా రోహిత్, ఆది, సందీప్ కిషన్, సుధీర్ బాబు హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ అందరిని ఆకట్టుకుంది. అలాగే టీజర్ తోనే అంచనాలు పెంచేసిన 'శమంతకమణి' ఇప్పుడు థియేట్రికల్ ట్రైలర్ తో వచ్చేసింది. టీజర్ లోనే 'శమంతకమణి' చిత్రం కథ మొత్తం ఒక కారు చుట్టూతా తిరిగే కథగా మనకి దాదాపు అర్ధమైపోయింది.

మరి 'శమంతకమణి' అంటే ఎదో ఒక క్రైం పేరు విన్నట్టు అనిపిస్తుంది. అలాగే 'శమంతకమణి' ట్రైలర్ ని చూస్తుంటే ఇదో క్రైమ్ థిల్లర్ చిత్రంలా కనిపించక మానదు. నలుగురు యువకులకు డబ్బుతో చాలా అవసరం ఉంటుంది. హైదరాబాద్ లోని టాప్ హోటల్ 500  మంది జనంతో జరుగుతున్న పార్టీలో 5  కోట్లు విలువ చేసే కారు..... 50  లక్షల డబ్బు కోసం సందీప్ కిషన్ పోరాటం, అమ్మాయిలతో ఇన్సల్ట్ అయ్యానంటున్న ఆది, నైట్ పార్టీలో మీకో స్పెషల్ గెస్ట్ ని ఇంట్రడ్యూస్ చేస్తానంటున్న సుధీర్ బాబు, కొడితే గట్టిగా కొట్టాలి.... ఒక్కదెబ్బతో లైఫ్ సెటిల్ అయ్యిపోవాలంటున్న నారా రోహిత్ వెరసి ఈ కేరెక్టర్స్ అర్ధం కాలేదంటూ రాజేంద్ర ప్రసాద్. ఇకపోతే ఆ నలుగురు యువకుల ఫైనల్ టార్గెట్ డబ్బు సంపాదించడమే.... ఇక చివరిగా రాజేంద్ర ప్రసాద్ మన కుర్రాళ్లందరికి అమ్మాయిలతోనే ప్రొబ్లెమ్స్ అంటూ ట్రైలర్ ఎండ్ అవుతుంది. ఈ మూవీ ట్రైలర్ ఆసాంతం ఆకట్టుకుంటుంది.

ఇక కథ మొత్తం 'శమంతకమణి' అనే కారు చుట్టూ ఉంటుందనేది ఫుల్ గా మనకి ట్రైలర్ లో అర్ధమైపోయింది. ఇక భవ్య క్రియేషన్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం ప్లస్ పాయింట్ అని చెప్పాలి.  ఈచిత్రం త్వరలోనే ప్రేక్షకులముందుకు రానుంది.

Click Here to see the Trailer

Shamanthakamani Trailer Released:

Shamanthakamani, an upcoming crime comedy's theatrical trailer was unveiled.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ