ఇటీవలే మెగాస్టార్ చైనా వెళ్లి వచ్చాడు. నాటి 1980నాటి సౌతిండియన్ సినీనటుల కలయిక సెలబ్రేషన్స్ కోసమే ఆయన తన సతీమణి సురేఖతో ఆ వేడుకకు హాజరయ్యారు. దాంతోనే ఆయన దాసరి మరణ వార్తను విన్నప్పటికీ కడచూపు చూసేందుకు రాలేదు. ఇక ప్రస్తుతం రాజకీయంగా మౌనంగా ఉన్నప్పటికీ ఆయన మరలా సినిమాలతో ఫుల్‌బిజీగా కానున్నాడు.
త్వరలోనే ఆంటే చిరంజీవి జన్మదినోత్సవం సందర్బంగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో ఆయన నటించనున్న 151వ చిత్రం 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' షూటింగ్‌ను ప్రారంభించనున్నాడు. ఆ సినిమా కోసమేనా అన్నట్టుగా గడ్డం, మీసాలతో కనిపిస్తున్నాడు. ఈ చిత్రాన్ని కూడా రామ్‌చరణే నిర్మించనున్న సంగతి తెలిసిందే.
ఇక ఈ చిత్రానికి దాదాపు మరో రెండు నెలలు గ్యాప్ ఉండటంతో ఆయన హఠాత్తుగా ఫ్యామిలీ టూర్ వేయడం ఆసక్తిని కలిగిస్తోంది. ఈ అమెరికా టూర్ ఎందు కోసమో ఏమో తెలియదు కానీ ఆయన వెంట భార్య సురేఖతో పాటు అల్లు అరవింద్ ఫ్యామిలీ కూడా కలిసి వెళ్తోంది. ఈ ట్రిప్‌లోప్రత్యేకతఏమీ లేదని, సాధారణంగా జరిగే ట్రిప్పేనంటున్నారు.
అదే సమయంలో ఉయ్యాలవాడలో తన మేకోవర్ విషయంలో పలువురు హాలీవుడ్ సాంకేతికనిపుణుల నుంచి సలహ తీసుకుంటారని, అయినా ఇది కేవలం జాలీ ట్రిప్పే అని తెలుస్తోంది.