వచ్చే సంక్రాంతికి రామ్ చరణ్, సుకుమార్, సమంతలు 'రంగస్థలం 1985', బాలకృష్ణ - రవికుమార్ - సి.కళ్యాణ్‌ల 'జయసింహా', మహేష్‌బాబు - కొరటాల శివల 'భరత్ అనే నేను' అనే మూడు పెద్ద చిత్రాల మద్య భీకరయుద్దం జరగనుంది. అయితే సంక్రాంతికి మూడు చిత్రాలను మోసే సత్తా ఉంది. కానీ గత రెండుమూడేళ్లుగా సంక్రాంతికి మంచి పోటీ ఉంటూనే ఉన్నప్పటికీ ఈ చిత్రాలన్నింటికీ ఫిబ్రవరి మొదటి వారం దాకా కలెక్షన్లు లాంగ్ రన్‌లో వచ్చేవి.
దాంతో ఓపెనింగ్స్‌లో చీలిక వచ్చినా కూడా లాంగ్‌రన్‌లో అడ్జస్ట్ చేసుకుని కవర్ అయ్యాయి. కానీ వచ్చే సంక్రాంతికి ఆ అవకాశం కనిపించేలా లేదు. జనవరి 11 నుంచి 15లోపు విడుదలయ్యే చిత్రాలన్ని కేవలం రెండు వారాలు మాత్రమే క్యాష్ చేసుకునే వీలుంది. ఆ తర్వాత మాత్రం థియేటర్లతో పాటు లాంగ్ రన్ కనిపించడం లేదు.దీనికి కారణం జనవరి 25న రజినీకాంత్, అక్షయ్‌కుమార్, శంకర్‌లు '2.0'లో థియేటర్ల పైకి దండయాత్ర చేయనుండటమే.
'బాహుబలి'ని ఎలాగైతే దేశంలోని ప్రతి సిని అభిమాని ఒక్కసారైనా చూడాలని భావించారో '2.0'కికూడా అదే రిపీట్ కావడం ఖాయమని విశ్లేషకులు తేలుస్తున్నారు. ఇక జనవరి మొదటి వారం నుంచి భారీ బడ్జెట్‌తో కనీవినీ ఎరుగని ప్రమోషన్స్ కోసం లైకా సంస్థ భారీ మొత్తాన్ని కేటాయిస్తోంది. సో.. ఈ సినిమా హడావుడి ఓ వారం ముందుగా ప్రారంభమైనా విచిత్రపోవాల్సిన అవసరం లేదు.