కోన వెంకట్... ఒకప్పుడు నిర్మాతగా ఉండి, తర్వాత రైటర్‌గా మారి 'ఢీ' తరహా చిత్రాలకు ట్రెండ్ సెట్ చేశాడు. నాడు శ్రీనువైట్ల - కోనవెంకట్ కాంబినేషన్ అంటేనే యమా క్రేజ్. యాక్షనికి ఎంటర్‌టైన్‌మెంట్, ఫ్యామిలీ ఎమోషన్స్‌ని టచ్ చేస్తూ ఆయన కథలు రాయడంతో స్టార్స్ కూడా తమ చిత్రాలకు కోననే కథ అందించాలని పట్టుపట్టేంతగా ఆయన క్రేజ్‌పెరిగింది.
ఇక నిర్మాతగా మారి అంజలితో 'గీతాంజలి' సహా ఒకట్రెండ్ హిట్ చిత్రాలు నిర్మించాడు. కానీ 'శంకరా భరణం'తో అది బెడిసికొట్టింది. మరోవైపు శ్రీనువైట్లతో విభేదించి విడిపోయాడు కానీ వారిద్దరూ విడిపోయిన తర్వాత ఇద్దరు రేసులో వెనుకబడిపోయారు. మెగా బలవంతం మీద 'బ్రూస్‌లీ' చేసినా పెద్దగా మనసు పెట్టి చేసినట్లు కనిపించలేదు.
ఇక నాగచైతన్య-గౌత మమీనన్‌ల 'సాహసం శ్వాసగా సాగిపో'ని ప్రొడ్యూస్ చేయాలని భావించి మిర్యాల రవీందర్‌రెడ్డికి అందించాడు. కాగా ఆ మధ్య ఆయన ముంబైలో కొన్ని రోజులు గడిపి శ్రీదేవికి కథ చెప్పించి ఒప్పించాడు. అదే 'మామ్' అని తెలుస్తోంది. తాజాగా ఈ చిత్రం జులై 7న విడుదల కానుంది. అదే రోజు కోన వెంకట్ తెలుగులో నాని హీరోగా శిర్వానిర్వాణ దర్శకత్వంలో దానయ్యతో 'నినుకోరి' చిత్రం నిర్మిస్తున్న చిత్రం కూడా విడుదల కానుంది.
'మామ్' పబ్లిసిటీ ఓ రేంజ్‌లో జరుగుతున్నా 'నిన్ను కోరి' ప్రమోషన్స్ పెరగడం లేదని, దానికి కోననే కారణమనే రచ్చ మొదలైంది. కానీ అలా పోస్ట్‌లుపెట్టిన వారికి నాని పెద్ద క్లాస్ పీకాడు. మరి ఒకే రోజున కోనకి సంబంధించిన రెండు చిత్రాలు ఒకే రోజున విడుదల కానుండటంతో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.