Advertisementt

బాలయ్య సినిమాలో మరో హీరో విలన్ గా?

Fri 30th Jun 2017 05:23 PM
srikanth,balakrishna,ks ravikumar,c kalyan,villain  బాలయ్య సినిమాలో మరో హీరో విలన్ గా?
Srikanth Villain Role in Balakrishna and KS Ravikumar Film బాలయ్య సినిమాలో మరో హీరో విలన్ గా?
Advertisement
Ads by CJ

యువ హీరోలకన్నా ఎక్కువ స్పీడుతో దూసుకుపోతున్నాడు సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ. ఆయన వరసబెట్టి సినిమాల్లో నటించేస్తూ క్షణం తీరికలేకుండా సినిమాల మీద సినిమాలు లైన్లో పెట్టేస్తున్నాడు. క్రిష్ తో తన 100 వ చిత్రం 'గౌతమీపుత్ర శాతకర్ణి' కంప్లీట్ చేసాడో లేదో.. పూరితో తన 101 వ చిత్రం 'పైసా వసూల్' మొదలు పెట్టేసాడు. ఇంకా ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగానే తన 102 వ చిత్రాన్ని సీనియర్ దర్శకుడు కె.ఎస్. రవికుమార్ డైరెక్షన్లో లైన్ లో పెట్టి షాక్ ఇచ్చాడు. అలాగే నయనతార.. బాలకృష్ణతో మూడోసారి జోడికట్టనున్న ఈ చిత్రానికి నిర్మాత సి కళ్యాణ్.

ఇక ఈ చిత్రం ఆగష్టు 2 న మొదలు కానుంది. సుమారు నలభై రోజుల పాటు తమిళనాడులోని కుంభకోణంలో మొదటి షెడ్యూల్ షూటింగ్ జరుపుకోనుంది. ఈ షెడ్యూల్ లో హీరో బాలకృష్ణ పాల్గొంటాడని సమాచారం. అయితే ఈచిత్రంలో బాలకృష్ణ కి విలన్ గా ఒక తెలుగు హీరో చేయనున్నాడనే వార్తలు వినబడుతున్నాయి. ఆ హీరో మరెవరో కాదు. ఒకప్పుడు హీరోగా టాలీవుడ్ లో రాణించిన శ్రీకాంత్, బాలకృష్ణ కి విలన్ గా ఈచిత్రంలో నటించనున్నాడట. అయితే ఈచిత్రంలో శ్రీకాంత్ పాత్ర చాలా చాలా వైవిధ్యంగా ఉంటుందని, నటనకు ఎక్కువ ఆస్కారముంటుందని తెలుస్తుంది.

ఇలాగే బోయపాటి శ్రీను, బాలకృష్ణ 'లెజెండ్' కోసం జగపతి బాబుని విలన్ గా తీసుకొచ్చి సక్సెస్ అయ్యాడు. ఆ చిత్రంలో జగపతి బాబు విలనిజానికి నూటికి నూరు మార్కులు పడ్డాయి. ఆ సినిమాతోనే జగపతి బాబు సెకండ్ ఇన్నింగ్స్ ఫుల్ జోష్ లో సాగిపోతుంది. ఇక ఇప్పుడు హీరోగా అవకాశాలు తగ్గిన శ్రీకాంత్ కూడా ప్రతినాయకుడిగా ఆకట్టుకుంటే మళ్ళీ శ్రీకాంత్ కి టాలీవుడ్ లో ఎదురుండదని అంటున్నారు. అయితే శ్రీకాంత్ ఈ చిత్రంలో విలన్ గా నటిస్తున్నాడు అనే విషయంపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి వుంది.

Srikanth Villain Role in Balakrishna and KS Ravikumar Film:

Actor Srikanth Turned Villain For Balakrishna and KS Ravikumar Movie. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ