Advertisementt

థర్టీ ఇయర్స్ పృథ్విని టార్గెట్ చేసిందెవరు?

Fri 30th Jun 2017 04:31 PM
balireddy pruthviraj,30 years industry prudhvi,prudhvi wife,sai sreenivas  థర్టీ ఇయర్స్ పృథ్విని టార్గెట్ చేసిందెవరు?
Who is trying to cheat 30 Years Prudhvi ? థర్టీ ఇయర్స్ పృథ్విని టార్గెట్ చేసిందెవరు?
Advertisement
Ads by CJ

'ఖడ్గం' సినిమాలో థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ డైలాగ్ తో బాగా పాపులర్ అయ్యి ఇప్పుడు కమెడియన్ గా టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి ఫామ్ లో వున్న పృథ్వి తన నిజ జీవితంలో కుటుంబ కలహాలతో విసిగి వేసారుతున్నాడు. పృథ్వి  భార్య శ్రీలక్ష్మి.. పృథ్వితో  చాలా రోజులు నుండి గొడవలు పడుతూ అతనిపై కేసు కూడా పెట్టింది. గత ఏడాదే పృథ్వి పై కేసు నమోదైంది. భార్యను హింసిస్తున్నాడని పృథ్వి మీద కేసు నమోదైంది. అయితే ఈకేసు కోర్టు వరకు వెళ్ళింది.

ఇక పృథ్వి భార్య శ్రీలక్ష్మి తనకు తన భర్త నుండి నెలకి 10  లక్షల భరణం ఇప్పించాలని కోర్టును వేడుకుంది. అయితే ఆ కేసులో  తీర్పును ఈ గురువారం విజయవాడ ఫ్యామిలీ కోర్టు తీర్పు వెలువరించింది. అయితే శ్రీలక్ష్మి కోరుకున్నట్టు 10  లక్షలు కాకుండా నెలకు పృథ్వి తన భార్య కి ఎనిమిది లక్షల భరణం చెల్లించాలని తీర్పునిచ్చింది కోర్టు. అయితే విజయవాడ కోర్టు తీర్పు వెలువరించినప్పుడు  పృథ్వి సినిమా షూటింగ్ లో భాగంగా విదేశాల్లో వున్నాడు.

ఇక ఈ కేసుపై పృథ్వి తనయుడు సాయి శ్రీనివాస్ స్పందన ఇలా వుంది. తన తల్లితండ్రులు గత ఏడాది నుండి గొడవలు పడుతున్నారు  కానీ, ఇలా కోర్టుకు వెళ్లి తన తండ్రిని తల్లి శ్రీలక్ష్మి  ఇబ్బంది పెడుతుందనుకోలేదని.... అసలు మా నాన్న పృథ్వి చాలామంచివారని... అలాగే తల్లి కూడా అమాయకురాలని, తన తల్లికి కోర్టుకు వెళ్లే తెలివితేటలూ లేవని, ఎవరో ఆమెని బాగా మోటివేట్ చేశారని.. చెబుతున్నాడు.

ఇక కమెడియన్ పృథ్వికి ఇద్దరు పిల్లలు ఒకరు సాయి శ్రీనివాస్ కాగా మరొకరు అమ్మాయి. ఆ అమ్మాయికి పృథ్వి ఈ మధ్యనే వివాహం జరిపించాడు. 

Who is trying to cheat 30 Years Prudhvi ? :

Actor 30 years Prudhvi to give 8 lakhs per month to his wife says Family court in Vijayawada

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ